ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..!

Tuesday, April 7, 2020 03:17 PM News
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..!

కరోనా ఇంకా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది, స్పెయిన్ లో కొంచం తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. ఇక ఏపీలో కరోనా కేసుల సంఖ్య మూడు వందలకు పైగా చేరుకున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఏపీ ప్రభుత్వం ఇవాళ ప్రజలకు తీపి కబురు చెప్పింది. సీఎం జగన్ ఇవాళ నిర్వహించిన సమీక్షలో అధికారులు ఈ మేరకు సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం . రాష్ట్రంలో కరోనా విస్తరణ వాస్తవ పరిస్ధితిపై ఒక స్పష్టత వచ్చిందని, దీంతో కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టనుందనే అంచనాలను అధికారులు సీఎం జగన్ కు అందించారు. దీంతో ప్రభుత్వం కూడా ఊపిరి పీల్చుకుంటోంది.

ఏపీలో మూడు వారాలుగా నిర్వహిస్తున్న కరోనా వైరస్ పరీక్షలు చివరి దశకు చేరుకుంటున్నాయి. నేరుగా కరోనా సోకిన వారితో పాటు వారితో ప్రాధమికంగా కాంటాక్ట్ అయినట్లు గుర్తించిన కరోనా బాధితులకు దాదాపుగా పరీక్షలు పూర్తయినట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. దీంతో ఇప్పుడు వారి నుంచి ఇతరులకు సోకిన వారికి పరీక్షలు నిర్వహించి కరోనా మహమ్మారిని రాష్ట్రం నుంచి పూర్తిగా తరిమేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏపీలో ఇవాళ ఉదయం 9 గంటలవరకూ మొత్తం 304 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 997 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 196 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. వీరితో కాంటాక్ట్‌ అయిన వారు, కలిసి ప్రయాణించిన వారు, కనీసం 3-4 గంటలు వారితో ఉన్నవారిలో 2400 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇందులో కోవిడ్‌ -19 పాజిటివ్‌గా వచ్చిన వారు 84 మందిగా తేలింది. ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారి ప్రైమరీ కాంటాక్టుల్లో 280 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విదేశాలనుంచి వచ్చిన వారికి 205 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 11 మందికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. విదేశాలనుంచి వచ్చిన వారితో కాంటాక్టు అయిన 120 మందికి పరీక్షలు నిర్వహించగా.. వీరిలో 6 గురికి పాజిటివ్‌ వచ్చింది.

For All Tech Queries Please Click Here..!
Topics: