పోలీసులు తన్నినా సరే, కరోనాతో చచ్చినా సరే, అది కావాలంటున్నారు..

Friday, March 27, 2020 01:15 PM News
పోలీసులు తన్నినా సరే, కరోనాతో చచ్చినా సరే, అది కావాలంటున్నారు..

అసలే మత్తుకు అలవాటైన ప్రాణాలు ఆపై 21 రోజుల లాక్ డౌన్ ఎటూ కదలక ఇంట్లో కూర్చొంటే డీ-ఎడిక్షన్ సెంటర్‌లో కూర్చొన్నట్టే భావిస్తున్నారు. పోలీసులు తన్నినా సరే రోడ్ల పైకి వెళ్లి కల్లు దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. కరోనా సంగతి దేవుడెరుగు.. రోజుకు గుక్కెడు మత్తు కల్లు లేకపోతే ప్రాణం బేజారు అని వాపోతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడనీ కుటుంబాలు ఇలా మాయదారి కల్లుకు చిన్నాభిన్నం అవుతున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో రోగం తిరగబెట్టడంతో ఆ కుటుంబాలకు కొత్త టెన్షన్ పట్టుకుంది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో పలు గ్రామాల్లో కల్లుబట్టీలు ఉన్నాయి. అయితే ఇక్కడ సప్లై చేసేది చెట్టు నుంచి దించిన కల్లు కాదు, కల్తీ కల్లు. రసాయనాలు కలిపి తయారుచేసే ఈ కల్తీ కల్లుకు బానిసలైనవారు కోకొల్లలు. నిత్యం చుక్క పడనిదే వీళ్లకు రోజు గడవదు. లేదంటే పరిస్థితి ఆగామాగమే. గతంలో ఎన్నోసార్లు ఇలాంటి ఘటనలు బయటపడ్డాయి. కల్లుబట్టీలు బంద్ చేసినప్పుడల్లా జనం మానసిక రోగుల్లా కల్లు కోసం తపించేవారు. శరీరం వణికిపోయేది.. కొంతమంది నిలబడ్డ చోటే కూలిపోయేవారు. ఆసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయించినా సరే.. తిరిగొచ్చాక మళ్లీ మత్తు కల్లే కావాలంటారు.

For All Tech Queries Please Click Here..!
Topics: