కుప్పలు తెప్పలుగా కరోనా శవాలు, తల్లడిల్లుతున్న జనం..!

Thursday, April 2, 2020 08:06 AM News
కుప్పలు తెప్పలుగా కరోనా శవాలు, తల్లడిల్లుతున్న జనం..!

కొన్ని దేశాలలో ఆస్పత్రి వార్డుల్లో ఎక్కడ చూసినా ఎటు చూసినా శవాలే ఆస్పత్రి ఆవరణలో ఎక్కడ చూసినా రోగులే, అందరు కరోనాతో బాధపడుతున్నవారే. అందరిదీ అదే వ్యథ. స్పెయిన్, ఇటలీ, అమెరికా, ఇరాన్ ఇలా దేశం ఏదైతేనేం మహమ్మారి బాధితులే ఇప్పుడు ఎక్కువవుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా 9,30,000 మందికి పైగా సోకగా. 47,000 పై చిలుకు మృతి చెందారు. మరణాల సంఖ్యలో ఇటలీ 13,155 మంది మృతులతో మొదటి స్థానంలో ఉండగా, స్పెయిన్ 10,011 మంది మృతులతో రెండవ స్థానంలో ఉంది. ఇటలీలో పరిస్థితి కాస్త కుదుట పడుతుంది కానీ స్పెయిన్‌లో మాత్రం కరోనా స్వైర విహారం చేస్తోంది. అక్కడ కేసుల సంఖ్య లక్ష దాటిపోయింది మరణాల సంఖ్య 10 వేలు దాటింది. అక్కడ నిన్న ఒక్క రోజే 923 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే అమెరికాలో 1,050 మంది, ఇటలీలో 720 మంది కరోనాకు బలయ్యారు. యూకే 563, ఫ్రాన్స్ 509, జర్మనీ 156, ఇరాన్ 138, నెదర్లాండ్స్ 134, బెల్జియంలో 123 ఇండియాలో 6 మరణాలు చోటుచేసుకున్నాయి.

For All Tech Queries Please Click Here..!
Topics: