మీరు మహిళా అధికారి అయిపోయారు..లేకుంటే వేరే విధంగా ఉండేది

Tuesday, March 16, 2021 01:00 PM News
మీరు మహిళా అధికారి అయిపోయారు..లేకుంటే వేరే విధంగా ఉండేది

Bhopal, Jan 18: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై దేశ రాజధాని ఢిల్లీలో గత నెల రోజులకు పైగా రైతులు ధర్నాలు ( 2020–2021 Indian farmers' protest) నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తరువాత మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే (Madhya Pradesh Congress MLA Harsh Gehlot) ఒక ఎస్‌డిఎం ర్యాంకుకు చెందిన లేడీ ప్రభుత్వ అధికారిని బెదిరిస్తున్నట్లుగా కెమెరాలో చిక్కింది. ఆయనని Sailana Constituency కి చెందిన  హర్ష్ విజయ్ గెహ్లాట్‌గా గుర్తించారు.

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకెళితే.. వ్యవసాయ చట్టాలకు (New Farm Laws) వ్యతిరేకంగా, రైతు ఉద్యమానికి మద్దతుగా నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీ తరువాత, ఎమ్మెల్యే (Harsh Vijay Gehlot) నేతృత్వంలోని ఉద్యమకారులు మెమోరాండం సమర్పించడానికి ఎస్‌డీఎం కార్యాలయానికి చేరుకున్నారు. దీన్ని స్వీకరించేందుకు కామిని ఠాకూర్ ఎంతకీ బయటికి రాకపోవడంతో ఎమ్మెల్యే గెహ్లాట్ తీవ్ర అసహనానికి గురైనారు. ఈ నియోజకవర్గం ప్రతినిధిని నేను.. నా మాటను మీరు అర్థం చేసుకోవడంలేదు.  

మీరొక మహిళా అధికారి అయిపోయారు..ఈ స్థానంలో మరో పురుష అధికారి వుంటే గల్లా పట్టుకొని మరీ... ఇచ్చేవాడిని(MLA Harsh Gehlot threatens lady SDM in Ratlam) అంటూ రెచ్చిపోయారు.  మధ్యప్రదేశ్-రాజస్థాన్ సరిహద్దు సమీపంలోని సైలానా పట్టణంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.  దీనిపై సర్వత్రా  ఆగ్రహం​ వ్యక్తం మవుతోంది. 

కాగా కాంగ్రెస్‌కు చెందిన మధ్యప్రదేశ్ మాజీ మంత్రి  సజ్జన్ సింగ్ వర్మ ఈ మధ్య మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం దుమారం రేగుతున్న సంగతి విదితమే. బాలికలు 15 ఏళ్ళలో పునరుత్పత్తి చేయగలిగినప్పుడు, వారి వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు ఎందుకు పెంచాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించతలబెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై (Tractor Rally) ఇన్‌జంక్షన్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారంనాడు విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున హాజరైన కేకే వేణుగోపాల్ తమ వాదన వినిపిస్తూ, రైతుల ర్యాలీ చట్టవిరుద్ధమవుతుందని, ఢిల్లీలోకి 5000 మంది ప్రజలు అడుగుపెట్టే అవకాశం ఉందని చెప్పారు. 

దీనిపై అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ, ఢిల్లీలోకి ప్రవేశమనేది శాంతి భద్రతల పరిస్థితే అయితే దానిని నిర్ధారించుకోవాల్సింది పోలీసులేనని సీజేఐ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ పేర్కొంది. రైతులను ఢిల్లీలోకి అనుమతించాలా వద్దా అనేది పోలీసులే నిర్ణయించుకోవాలని తెలిపింది. శాంతి భద్రతల విషయంలో పోలీసులకు ఉన్న అధికారాల గురించి కేంద్రానికి తాము తెలియజేయాల్సిన పని లేదని పేర్కొంది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. కాగా,  రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా తాము ప్రశాంతంగా ర్యాలీ నిర్వహిస్తామని రైతులు ఆదివారంనాడు ప్రకటించారు.

ట్రాక్ట‌ర్ల ర్యాలీల‌తో ఆర్డీ సంబ‌రాల‌ను అడ్డుకోవ‌డం.. దేశానికి అవ‌మానంగా మిగులుతుంద‌ని ఢిల్లీ పోలీసులు త‌మ పిటీష‌న్‌లో సుప్రీంకు తెలిపారు. నిర‌స‌న చేసే హ‌క్కు ఉంది కాదా అని.. దేశానికి చెడ్డ‌ పేరు తెచ్చే చ‌ర్య‌లు చేప‌ట్ట‌వ‌ద్దు అని కేంద్రం త‌న పిటిష‌న్‌లో తెలిపింది.  అయితే రాజ్‌ప‌థ్‌లో జ‌రిగే ప‌రేడ్‌కు మాత్రం అభ్యంత‌రం క‌లిగిచ‌బోము అని రైతు నేత‌లు పేర్కొన్నారు.  సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ సుమారు వెయ్యి ట్రాక్ట‌ర్ల‌తో ఆ రోజున రైతులు ఢిల్లీలో ర్యాలీ తీయాల‌ని భావిస్తున్నారు.

  
 
 

For All Tech Queries Please Click Here..!