LIC లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల. వివరాలు తెలుసుకోండి..

Wednesday, September 18, 2019 07:52 AM News
LIC లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల. వివరాలు తెలుసుకోండి..

LIC (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్) ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత దేశంలో ఎంతో మందికి కుటుంభంలో వ్యక్తిని కోల్పోయిన తరువాత ఆర్ధిక భరోసా ఇచ్చింది మన LIC. ఈ క్రమంలోనే LIC అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మందికి ఉపాది అవకాశాలు కూడా కల్పించింది. ఈ సంస్థలో చేరడానికి చాలా మంది నిరుద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు కూడా. అయితే తాజాగా LIC నుంచీ ఉద్యోగ ప్రకటన వెలుబడింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న డివిజినల్ కార్యాలయాలలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి LIC గ్రీన్ సింగల్ ఇచ్చింది. అందుకు అనుగుణంగా అర్హులైన అభ్యర్ధుల నుంచీ దరఖాస్తులని ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.

మొత్తం ఖాళీలు : 8500

అర్హత : బ్యాచిలర్ డిగ్రీ

వయసు : 18 - 30

ఎంపిక విధానం : ప్రిలిమినరీ, మెయిన్స్, మెడికల్ టెస్ట్

దరఖాస్తు విధానం : ఆన్లైన్

ప్రిలిమినరీ పరీక్ష తేదీ : అక్టోబర్ 21, 22 -2019

దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్ , 1 , 2019

మరిన్ని వివరాలకోసం : https://licindia.in/ వెబ్ సైట్ లో చెక్ చేయండి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: