కిమ్ వారం కిందటే మృతి చెందారు, వివరాలు బయటపెట్టిన జి సియాంగ్ కిమ్ ..

Saturday, May 2, 2020 08:17 AM News
కిమ్ వారం కిందటే మృతి చెందారు, వివరాలు బయటపెట్టిన  జి సియాంగ్ కిమ్ ..

గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ దేశానికి చెందిన జి సియాంగ్ కిమ్ దీనిపైన స్పందించారు. వారం రోజుల క్రితమే కిమ్ చనిపోయాడని, తన దగ్గర అందుకు సంబంధించిన కచ్చితమైన సమాచారం ఉందని చెప్పారు. కిమ్ మరణాన్ని వారసుల ఎంపిక స్పష్టత తరువాత అధికారికంగా ప్రకటిస్తారని తెలిపారు.జి సియాంగ్ హో దక్షిణ కొరియాకు వలస వచ్చి గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు.

తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నిన్న జి సియాంగ్ స్థానిక యోన్‌హాప్‌ వార్త సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలం నుంచి కిమ్ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో ఆయన గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గత నెల 11 నుంచి ఆయన కనిపించకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏప్రిల్ 15న తన తాన 108వ జయంతి కార్యక్రమనికి కూడా కిమ్ హాజరు కాలేదు. అధికారిక కార్యక్రమాలకు కిమ్ దూరంగా ఉండటంతో ఆయన ఆరోగ్యం గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: