కీలకంగా వ్యవహరించిన ఏపీ పోలీసులు

Friday, April 3, 2020 02:01 PM News
కీలకంగా వ్యవహరించిన ఏపీ పోలీసులు

గత నెలరోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మన అందరి సెల్ ఫోన్లు అన్నీ ఎక్కడెక్కడ ఏ ఏ టవర్లకి కనెక్ట్ అయ్యాయి అన్న వివరాలు మొత్తం సేకరించారు. దాని ద్వారా మన రాష్ట్రంలో రిజిస్టర్ అయిన ఫోన్లు ఢిల్లీలో టవర్లకి కనెక్ట్ అయిన మొబైల్స్ వివరాలు ద్వారా ఢిల్లీ మతప్రచారాలకి వెళ్లి వచ్చిన మొత్తాన్ని రెండురోజుల్లోనే గుర్తించగలిగారు. సహజంగానే మనం  ఢిల్లీ వెళ్తే అక్కడ టవర్లకి కనెక్ట్ అవుతాం కాబట్టి మన వాళ్లందరినీ సులభంగా ట్రేస్ చేయగలిగాము. 

అలాగే వాళ్ళ కాల్ డేటా ద్వారా వాళ్ళు తిరిగివచ్చాక ఎవరెవరిని కలిసే అవకాశం ఉందో వాళ్ళతో మాట్లాడిన కలిసిన వాళ్ళని కూడా క్వారంటైన్ చేసారు. అసలైన విజన్ అంటే ఇది అనేలా మన ఆంధ్రా పోలీస్ ప్లాన్ ఉంది. నిజంగా టెక్నాలజీ తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుందో జగనన్న చేతల ద్వారా నిరూపించాడు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో జగనన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉండటం మన రాష్ట్ర ప్రజల అదృష్టం అని చాలా మంది కీర్తిస్తున్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: