Breaking News: కరోనాకు మందు దొరికింది.. 48 గంటల్లో వైరస్ ఖతం..

Monday, April 6, 2020 12:53 PM News
Breaking News: కరోనాకు మందు  దొరికింది.. 48 గంటల్లో వైరస్ ఖతం..

కరోనా వైరస్‌కు మందు కనిపెట్టడంకోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు కరోనాకు మందు కొనుగొన్నట్టు ఓ పరిశోధన కేంద్రం తెలియజేస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన సైంటిస్టులు యాంటీ పారాసిటిక్ డ్రగ్‌ను ల్యాబ్‌లో అభివృద్ది చేసి వాటిని SARS-CoV-2 వైరస్‌ మీద ప్రయోగటించారు. ఆ డ్రగ్ 48 గంటల్లోనే వైరస్‌ను చంపేసినట్టు పరీక్షల్లో వెల్లడయింది. Ivermectin అనే ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన డ్రగ్ హెచ్ఐవీ, డెంగ్యూ, ఫ్లూ, జికా వైరస్ లాంటి వాటి మీద కూడా బలంగా పనిచేస్తోందని సైంటిస్టులు గతంలోనే గుర్తించారు. మోనాష్ యూనివర్సిటీ నుంచి ఈ పరిశోధన కి సంబందించిన రికార్డులను యాంటీ వైరల్ రిసెర్చ్ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. Ivermectin సింగల్ అనే డోస్ కరోనా వైరస్ వృద్ది చెందకుండా నియంత్రించినట్టు అందులో పేర్కొంది.

ఈ డ్రగ్ రెండు రోజుల్లో మొత్తం వైరస్‌ను అంతం చేసినట్టు తెలిపింది. Ivermectin సింగల్ డోస్ వైరస్ ను 48 గంటల్లోనే అంతం చేసినట్టు గుర్తించాం. అలాగే, 24 గంటల్లో కూడా బాగా తగ్గించగలిగింది అని ఈ పరిశోధనకు నాయకత్వం వహిస్తున్న డాక్టర్ కైల్ వాగ్‌స్టాఫ్ తెలిపారు. ప్రస్తుతం ఈ టెస్టులు ల్యాబ్‌లో జరుగుతున్నాయని, మనుషులపై ప్రయోగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. Ivermectin అనేదాన్ని ఓ సేఫ్ డ్రగ్‌. అయితే, మనుషుల మీద ఎంతమేరకు ప్రభావంగా పనిచేస్తుందనేది చూడాలి. అదే నెక్ట్స్ స్టెప్. అని వాగ్ స్టాఫ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఈ మందుకు ఆమోదం తెలిపితే అది ప్రజలకు త్వరగా చేరుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, ఆ Ivermectin అనేది వైరస్ మీద ఎలా పనిచేస్తుందనే మెకానిజం ఇంకా తెలియాల్సి ఉంది. మిగిలిన వైరస్‌ల మీద చూపినట్టే ప్రభావం చూపుతుందా? లేకపోతే తల్లి కణాలను చంపుతుందా అనేది చూడాలి.

For All Tech Queries Please Click Here..!
Topics: