కరోనాపై విజయం గురించి వెల్లడించిన భారతీయ శాస్త్రవేత్తలు!

Tuesday, April 28, 2020 09:51 PM News
కరోనాపై  విజయం గురించి వెల్లడించిన భారతీయ శాస్త్రవేత్తలు!

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్ మూలాన నెలకొన్న ఈ లాక్ డౌన్ లు ఇంకా ఎన్నాళ్ళు ఉంటాయో అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఇప్పుడు ప్రజలు అంతా పడుతున్న ఇబ్బందులు దాటాలి అంటే దానికున్న ఏకైక మార్గం ఈ వైరస్ ను పూర్తిగా అంతం చెయ్యడం.ఇప్పటికే ప్రపంచ దేశాలు అన్ని దీనికి వ్యాక్సిన్ ను కనుగొనే పనిలో తీవ్రంగా శ్రమిస్తున్నారు.

కానీ ఈ వైరస్ కు మందు కనుక్కోవడం ఇప్పుడప్పుడే జరిగేలా లేదని మనదేశానికి చెందిన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వెస్ట్ బెంగాల్ జీనం ఇన్స్టిట్యూట్ కి చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారి గురించి తాము చేసిన అధ్యయనం ద్వారా కొన్ని భయంకర విషయాలను వెల్లడించారు. ఈ వైరస్ మొత్తం పది రూపాలను కలిగి ఉంటుంది అని.

దానిలోని ఎల్లప్పుడూ రూపాంతరం చెందే లక్షణాలు ఉన్నాయని అందుకే అది పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 10 రకాల వైరస్ గా మారగలిగింది అని తెలిపారు. అంతే కాకుండా ఈ వైరస్ ఆదిలో భారతదేశం మరియు చైనా దేశాలలోని గుర్తించబడింది అని వెల్లడించారు. అలాగే ఈ వైరస్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు ఈ కణాలు ఊపిరితిత్తులలోకి కానీ చేరితే దాని పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని వారు తెలిపారు.

For All Tech Queries Please Click Here..!
Topics: