భారత క్రికెటర్ ఆత్మహత్య: షాక్‌లో క్రికెట్ ప్రపంచం

Friday, August 16, 2019 10:09 AM News
భారత క్రికెటర్ ఆత్మహత్య: షాక్‌లో క్రికెట్ ప్రపంచం

భారత మాజీ క్రికెటర్, ఓపెనింగ్ బ్యాట్స్ మన్, తమిళనాడు క్రికెట్‌ కు ఎంతోకాలం సేవలందించిన వీబీ చంద్రశేఖర్, అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా చెన్నైలోని తన నివాసంలో కనిపించగా, పోలీసులు ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. 57 ఏళ్ల చంద్రశేఖర్, ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు ప్రీమియర్ లీగ్ టీమ్ 'వీబీ కంచి వీరన్స్' ఏర్పాటైన తరువాత ఆయనపై రుణభారం పెరిగినట్టు తెలుస్తోంది. కేసును విచారిస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత మరికొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు.

భారత్ తరఫున 7 వన్డేలు ఆడిన చంద్రశేఖర్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సత్తా చాటుతూ 43.09 సరాసరిని నమోదు చేశారు. చంద్రశేఖర్ మరణవార్త క్రికెట్ వర్గాల్లో కలకలం రేపింది. బీసీసీఐతో పాటు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ం సురేశ్ రైనా తదితరులు సంతాపం తెలిపారు. తమిళనాడు ఓపెనర్‌ గా చంద్రశేఖర్ గుర్తుండిపోయేలా ఎన్నో ఇన్నింగ్స్‌ ఆడారు. 1988–89 ఇరానీ కప్‌ మ్యాచ్‌ లో 56 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 2012లో ఆటకు రిటైర్ మెంట్ ప్రకటించిన ఆయన తమిళనాడు కోచ్‌ గా, భారత జట్టు సెలక్టర్‌ గా పనిచేశారు.

For All Tech Queries Please Click Here..!
Topics: