పాకిస్తాన్ ఆందోళన చెందేలా మా స్పందన ఉంటుంది.

Monday, May 18, 2020 03:58 PM News
పాకిస్తాన్ ఆందోళన చెందేలా మా స్పందన ఉంటుంది.

దేశంలో విపత్కర పరిస్థితులు వస్తే 24x7 పనిచేయడానికి తాము సదా సిద్ధంగానే ఉన్నామని భారత వైమానిక దళం చీఫ్ బధూరియా సోమవారం ప్రకటించారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద క్యాంపులు, లాంచ్‌ప్యాడ్‌లపై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించగా ఆయన విపత్కర పరిస్థితులు వస్తే 24x7 పనిచేయడానికి తాము సదా సిద్ధంగానే ఉన్నామని స్పందించారు.

పరిస్థితులు గనుక తీవ్రతరమై, డిమాండ్ చేస్తే మాత్రం 24 x7 పనిచేయడానికి వైమానిక దళం సిద్ధంగా ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఉన్న ఉగ్రవాద శిబిరం లేదా లాంచ్‌ప్యాడ్‌పై దాడులు చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం అని తేల్చి చెప్పారు. భారత దేశంపై ఉగ్రవాద దాడి జరిగినప్పుడల్లా, పాకిస్తాన్ ఆందోళన చెందుతూనే ఉండాలని, కచ్చితంగా ఆందోళన చెందేలా తాము స్పందిస్తామని ఆయన ప్రకటించారు. పాకిస్తాన్ ఈ ఆందోళనల నుంచి బయటపడాలంటే మాత్రం భారత్‌పైకి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఎగదోయడం మానుకోవాల్సిందేనని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. 


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: