ఏకంగా రూ.10 పెరిగిన పెట్రోలు ధర.. ఆందోళనలో వాహనదారులు...!

Monday, September 23, 2019 10:16 AM News
ఏకంగా రూ.10 పెరిగిన పెట్రోలు ధర.. ఆందోళనలో వాహనదారులు...!

గత కొద్ది రోజులుగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయన్న వార్తలు నిజమవుతున్నాయి. ఇప్పటికే గత వారం రోజుల నుంచి పెట్రోల్ ధరలు వరుసగా పెరుగుతూనే వస్తున్నాయి. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్క తీరు ధరలతో వాహనదారులు హడలెత్తిపోతున్నారు. మధ్యప్రదేశ్‌లో పెరిగిన పెట్రోల్ ధర చూసిన వాహనదారులు పెట్రోలు కొనాలంటేనే భయపడిపోతున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇంధనంపై పెంచిన సుంకాలతో ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్కసారిగా 5 శాతం వ్యాట్‌ను పెంచడంతో. పెట్రోలు ధరలు ఆకాశానికి ఎగశాయి. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం పెరిగిన పెట్రోల్ ధరలు దేశంలో ఎక్కడా కూడా ఈ స్థాయిలో పెరగలేదు. అయితే పెంచిన వ్యాట్‌తో పెట్రోల్ ధర లీటర్‌కు ఏకంగా రూ.10 పెరిగింది.

పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం డీజిల్ ధర లీటరుకు రూ. 2 నుంచి 7 ఎక్కువ ఉండగా. పెట్రోలు ధర రూ.4 నుంచి 10 రూపాయలు ఎక్కువగా ఉన్నాయి. అకస్మాత్తుగా ధరలు పెరగడంతో సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. పెట్రో ధరలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చి. ఇప్పుడు ఇలా చేస్తున్నారంటూ కమల్ నాథ్ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. 


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: