జగన్ కు ఝలక్, ఏపీకి వచ్చేవారిపై హైకోర్టు కీలక ఆదేశం

Friday, March 27, 2020 07:14 PM News
జగన్ కు ఝలక్, ఏపీకి వచ్చేవారిపై హైకోర్టు కీలక ఆదేశం

కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా లాక్ డౌన్ చేశాయి తెలుగు రాష్ట్రాలు . ఇక లాక్ డౌన్ ప్రభావంతో హైదరాబాద్ లోనూ హాస్టళ్ళు ఖాళీ అయ్యాయి . ఇక హైదరాబాద్ లో చిక్కుకుపోయిన ఆంధ్రావాసులకు తెలంగాణ పోలీసులు ఏపీకి వెళ్ళటానికి ఎన్వోసి ఇచ్చి మరీ పంపించారు. అయితే ఏపీ సరిహద్దుల్లో వారందరినీ ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఏపీలోకి రావడానికి వీల్లేదని తెలంగాణలోనే ఉండాలని సూచించారు. ఇక గత రెండు రోజులుగా ఇది రగడగా మారుతుంది. సరిహద్దుల్లో నిరీక్షిస్తున్న వారిని ఏపీలోకి ప్రభుత్వం అనుమతించకపోవటంతో ఉద్రిక్త పరిస్థితులు పోలీసుల మీద దాడి చేసే దాకా వెళ్ళాయి . అయితే ప్రభుత్వం మాత్రం సరిహద్దులను మూసివేశామని ఎవరూ రావద్దని స్పష్టంగా చెప్పింది.

తెలంగాణలో ఉన్న ఆంధ్రులు ఏపీకి రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడం రాష్ట్ర సరిహద్దుల్లోనే ఆపివేయడంపై బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ తాజాగా ఏపీ హైకోర్టు లో పిటీషన్ వేశారు. దీనిపై శుక్రవారం విచారించిన హైకోర్టు ఏపీలోకి వెంటనే బేషరతుగా తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సహా ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చేవారిపై హైకోర్టు తాజాగా శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ఉన్న ఆంధ్రులకు కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఎన్.వోసీని సరిహద్దుల్లోనే పరిశీలించి ఆరోగ్యంగా ఉంటే ఏపీలోకి అనుమతించాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇక కోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ ప్రభుత్వానికి ఝలక్ అని చెప్పొచ్చు .

For All Tech Queries Please Click Here..!
Topics: