మర్కజ్ చీఫ్ పరారీ, సంచలన ఆడియో విడుదల, వైరస్ వ్యాప్తి అందుకేనంటూ..?

Friday, April 3, 2020 06:30 AM News
మర్కజ్ చీఫ్ పరారీ, సంచలన ఆడియో విడుదల, వైరస్ వ్యాప్తి అందుకేనంటూ..?

ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదు దేశంలోనే అతి పెద్ద కరోనా వైరస్ హాట్ స్పాట్ గా తేలింది. లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ సామూహిక ప్రార్థనలు నిర్వహించడం. విదేశాల నుంచి వచ్చినవాళ్ల ద్వారా వేల మందికి వైరస్ సోకడం. దానికి కారణమైన బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేయటం మొదలుపెటిన వెంటనే  మర్కజ్ చీఫ్ పరారైపోయారు. గుర్తుతెలియని ప్రాంతంలో ఉంటూ ఒక్కొక్కటిగా ఆడియో టేపులు విడుదలచేస్తున్నారు. పలు మీడియా సంస్థల ద్వారా సదరు టేపులు బహిర్గతమవుతున్నాయి. ఆయన కోసం ఢిల్లీ, యూపీ పోలీసులు గాలిస్తున్నారు.

ప్రపంచమంతటా విలయం సృష్టిస్తోన్న కరోనా వైరస్ ధాటికి ఇప్పటికే 50వేల మంది చనిపోగా, మరో 10 లక్షల మంది దాని భారీన పడ్డారు. ఇండియాలో గురువారం నాటికి 69 మంది ప్రాణాలుకోల్పోగా, 2,474 మందికి పాజిటివ్ అని తేలింది.ఈ పరిస్థితిపైన మర్కజ్ చీఫ్ తనదైన కారణం చెప్పారు. మనుషజాతి అడ్డూఅదుపు లేకుండా పాపాలు చేస్తున్నందువల్లే ఈ మహమ్మారి పుట్టుకొచ్చిందని ఆయన సూత్రీకరించారు. ఇందులో సందేహానికి తావు లేవు. కచ్చితంగా మనుషులు చేసిన పాపాలకు శిక్షగానే ఈ వైరస్ వ్యాప్తి చెందింది. భగవంతుడు మనపై చూపించిన ఆగ్రహానికి ప్రతిరూపం ఇది అని అన్నారు'

For All Tech Queries Please Click Here..!
Topics: