కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న ప్రదేశాలు..

Sunday, May 10, 2020 09:17 AM News
కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న ప్రదేశాలు..

వైరస్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు అమలు చేస్తున్నా వ్యాధి వ్యాప్తి మాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. దేశంలో ఏమూలనూ వదలకుండా కరోనా వ్యాప్తించింది. దేశవ్యాప్తంగా కొరోనా మహమ్మారి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్ర : దేశంలో అత్యంత దారుణమైన పరిస్థితిని మహారాష్ట్ర ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై మహానగరంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వైరస్‌ వ్యాప్తి కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా ఏమాత్రం అదుపులోకి రావడంలేదు. ఇక ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ధారావిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 19063 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 737 మంది మృత్యువాత పడ్డారు.

గుజరాత్‌ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లోనూ వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7402 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వైరస్‌ కారణంగా 449 మంది మరణించారు. కరోనా కేసులు నమోదులో దేశంలో గుజరాత్‌ రెండోస్థానంలో ఉంది. (ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు)

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ కరోనాతో అల్లాడుతోంది. మొన్నటి వరకు తీవ్రమైన వాయు కాలుష్యంతో తల్లడిల్లిన హస్తిన వాసులను కరోనా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నిజాముద్దీన్‌లో నిర్వహించిన మత ప్రార్థనలను ఢిల్లీతో పాటు యావత్‌ దేశాన్ని వణికించాయి. ఇక ఢిల్లీ సర్కార్‌ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 6318 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 66 మంది ప్రాణాలు ఇడిచారు. కేసుల సంఖ్య పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

తమిళనాడు : దేశంలో కరోనా కేసు నమోదైన మొదటి నెల వరకూ సురక్షితంగా ఉన్న తమిళనాడును తబ్లిగీ మత ప్రార్థనాలను చుట్టుమట్టాయి. దేశంలో తబ్లిగీలను ద్వారా అత్యంత ఎక్కువగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. శుక్రవారం ఒక్క రోజే రాష్ట్రంలో 600 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం కలకలం రేపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6009కి చేరింది. వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు 40 మంది చనిపోయారు.

రాజస్తాన్‌ : ఇక రాజస్తాన్‌లోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3579 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. అయితే మరణాల శాతం కాస్త ఎక్కువగా ఉండటం ఆందోళనకర విషయం. వ్యాధి కారణంగా ఇప్పటి వరకు 101 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు కోటాలో దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులను విడదల వారిగా స్వస్థలాలకు పంపించారు. 

For All Tech Queries Please Click Here..!
Topics: