కరోనా ఎఫెక్ట్ : అమెరికాలో అసాధారణం, కరోనా విలయతాండవం.

Wednesday, April 1, 2020 07:29 AM News
కరోనా ఎఫెక్ట్ : అమెరికాలో అసాధారణం, కరోనా విలయతాండవం.

ప్రపంచవ్యాప్తంగా 185 దేశాల్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మంగళవారం నాటికి 40,673 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోగా, 8,19,038 మంది వ్యాధి బారినపడ్డారు. అమెరికాలో తీవ్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. యుద్ధ సమయాల్లో కనిపించే తాత్కాలిక క్షేత్రస్థాయి ఆసుపత్రులు న్యూయార్క్‌ సెంట్రల్‌ పార్క్‌లో ఏర్పాటయ్యాయి. మన్‌హట్టన్‌ సమీపంలో ఓ యుద్ధ నౌకలో వెయ్యి పడకల ఆస్పత్రిని సిద్ధం చేశారు. ఉపాధి కోల్పోయిన పలువురు నగరంలోని ఫుడ్‌బ్యాంకుల్లో ఆహారం కోసం క్యూ కడుతున్నారు. వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రజలకు హామీ ఇచ్చినప్పటికీ రానున్న నెల రోజులు అమెరికా అతిపెద్ద సవాలు ఎదుర్కోబోతోందన్న ఆయన హెచ్చరిక అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. అమెరికాలో 3,400 మంది కరోనాకు బలికాగా, 1,74,665 మందికి వైరస్‌ సోకింది.

యూరప్‌లో మొత్తం 4,29,362 కోవిడ్‌ కేసులు ఉండగా, ఆసియాలో ఈ సంఖ్య 1,08,143గా ఉంది. యూరప్‌లో 27,740 మంది ప్రాణాలు కోల్పోగా ఆసియాలో 3,878 మంది బలి అయ్యారు. మధ్యప్రాచ్యంలో కోవిడ్‌ కేసుల సంఖ్య 54,642 కాగా, మరణాలు 2,999గా ఉంది. లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ దీవుల్లో 16,399 కేసులు, 417 మరణాలు సంభవించాయి. ఆఫ్రికాలో 5,343 కేసులు, 170 మరణాలు నమోదయ్యాయి.

For All Tech Queries Please Click Here..!
Topics: