చచ్చినట్టు నటిస్తూ అంబులెన్సులో గ్రామానికి, ఇంతలో అనుకోని సంఘటన.

Wednesday, April 1, 2020 10:21 AM News
చచ్చినట్టు నటిస్తూ అంబులెన్సులో గ్రామానికి, ఇంతలో అనుకోని సంఘటన.

కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. దీనితో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న జనం తమ ఇంటికి చేరుకోవడానికి వింత మార్గాలను కూడా వెతుకుతున్నారు. జమ్ముకశ్మిర్ కు చెందిన పూంచ్ జిల్లాలో అంబులెన్స్ సాయంతో గ్రామానికి వెళుతున్న ఒక వ్యక్తిని ముగ్గురు సహచరులతో సహా పోలీసులు పట్టుకున్నారు. అంబులెన్స్ డ్రైవర్‌ను అరెస్టు చేసి, మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు నకిలీ మరణ ధృవీకరణ పత్రం కూడా లభించింది.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం లాక్ డౌన్ సమయంలో సురన్‌కోట్‌ పోలీసు బృందం పెట్రోలింగ్ లో ఉంది. ఈ సమయంలో ఒక ప్రైవేట్ అంబులెన్స్ వారికి కనిపించింది. పోలీసులు దానిని ఆపి, విచారణ చేశారు. అంబులెన్సు లో ఒక వ్యక్తి చనిపోయినట్టు నటిస్తున్నాడని పోలీసులు గ్రహించారు. దీనితో పోలీసులు అంబులెన్సులోని వారినందరినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. వారిని అరెస్టు చేసి, కేసునమోదు చేశారు.

For All Tech Queries Please Click Here..!
Topics: