బ్రేకింగ్: ఏపీలో ఘోరం.. లోయలో పడ్డ బస్సు భారీగా మృతులు

Tuesday, October 15, 2019 12:43 PM News
బ్రేకింగ్: ఏపీలో ఘోరం.. లోయలో పడ్డ బస్సు భారీగా మృతులు

ఏపీలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది  లోయలో పడ్డ బస్సు భారీగా మృతులు. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి చింతూరు మధ్య వాల్మీకి ఘాట్ రోడ్డులో పర్యాటక బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో పదిమంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. బస్సులో 20కు పైగా మంది ప్రయాణించినట్లు సమాచారం.

గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సు మారేడుమిల్లి నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైనట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.