హైదారాబాద్‌లో విషాదం: బర్త్ డే పార్టీ చేసుకుని 47 మందికి కరోనా అంటించారు

Sunday, May 10, 2020 02:16 PM News
హైదారాబాద్‌లో విషాదం: బర్త్ డే పార్టీ చేసుకుని 47 మందికి కరోనా అంటించారు

హైద్రాబాదులోని ఎల్బీనగర్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఓ కుటుంబం చేసుకున్న బర్త్‌డే పార్టీ కారణంగా 47 మందికి కరోనా సోకింది. షాప్ ఓనర్ నుంచి మలక్‌పేట గంజ్‌లో పనిచేసే కార్మికుడికి వైరస్ సోకింది. వ్యాపారి కుటుంబ సభ్యులతోపాటు వారి బంధువులకు కరోనా సోకింది. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బర్త్‌డే పార్టీ కారణంగా 45 మందికి కరోనా సోకితే అందులో 25 మంది వ్యాపారి కుటుంబసభ్యులే ఉన్నారు.

 వనస్థలిపురంలోని కంటైన్మెంట్ జోన్లలో జీహెచ్ఎంసీ అధికారులు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఎల్బీనగర్ వనస్థలిపురం ప్రాంతాల్లో మొత్తం 15 కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ప్రస్తుతం అధికారులు ప్రైమరీ కాంటాక్ట్ కేసుల్ని వేతికేపనిలోపడ్డారు. ఎల్బీనగర్‌లో ఇప్పటి వరకు 57 కేసులు నమోదు కాగా ఐదుగురు మృతి చెందారు. 44 మంది చికిత్స పొందుతుండగా 8 మంది డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్‌లో నమోదు అవుతున్న కేసుల్లో ఎక్కువిగా ఎల్బీనగర్ ప్రాంతంలోనే ఉంటున్నాయి. దీంతో అధికారులు ఎల్బీనగర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: