బ్రేకింగ్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య..

Saturday, May 2, 2020 08:23 AM News
బ్రేకింగ్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య..

ప్రపంచ దేశాలపైన కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. కరోనా బారినపడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్‌ దాడి నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికానే ఎక్కువ నష్టపోయింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో 2,39,592 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 34.01 లక్షలకు చేరుకుంది.

ఈ వైరస్‌ నుంచి కోలుకుని 10.81 లక్షల మందికి పైగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రధానంగా యూరప్ దేశాలు, అమెరికాలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి.పలు దేశాల్లో కరోనా మరణాల సంఖ్య ఇలా ఉంది... యూఎస్‌ఏలో 65,766 మంది, స్పెయిన్‌లో 24,824, ఇటలీలో 28,236, యూకేలో 27,510, ఫ్రాన్స్‌లో 24,594, జర్మనీలో 6,736, టర్కీలో 3,258, రష్యాలో 1,169, ఇరాన్‌లో 6,091, బ్రెజిల్‌లో 6,410, చైనాలో 4,633, కెనడాలో 3,391, బెల్జియంలో 7,703, నెదర్లాండ్స్‌లో 4,893, ఇండియాలో 1,223, స్విట్జర్లాండ్‌లో 1,754 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందుముందు ఈ సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: