శృంగారంలో ఉన్నపుడు ఇలాంటివి ట్రై చేస్తే ఆ మజాయే వేరు!

Sunday, August 18, 2019 05:18 PM Lifestyle
శృంగారంలో ఉన్నపుడు ఇలాంటివి ట్రై చేస్తే ఆ మజాయే వేరు!

దంపతులు ఎంత ఉత్సాహంగా ఎంత ఉల్లాసంగా శృంగారాన్ని ఆస్వాదిస్తే.. అది వారి ఆరోగ్యానికి,బంధానికి అంత మంచిది. కాబట్టి శృంగారంలో బోర్ అనే ఫీల్ కలగకుండా చూసుకోవాలి. అలా జరగాలంటే రొటీన్‌కు కాస్త భిన్నంగా ఆలోచించాలి. మరి అలా రొటీన్‌కు భిన్నంగా ఏం చేస్తే శృంగారంలో థ్రిల్ ఫీల్ అవుతారో తెలుసుకోవాలంటే కింది విషయాలు చదవండి..

1. నిత్యం ఒకే ప్రదేశంలో శృంగారం చేయడం కూడా బోర్ ఫీలింగ్ కలిగిస్తుంది. కాబట్టి శృంగారాన్ని పడకగదిలోనే కాక.. అప్పుడప్పుడు షవర్ కింద లేదా కిచెన్‌‌లో లేదా దంపతులకు అనువుగా ఏకాంతం దొరికే మరేదైనా ప్రదేశంలో శృంగారం చేయడం థ్రిల్లింగ్ ఫీల్ కలిగిస్తుంది.

2. కొంతమంది దంపతులు ఓపెన్ సెక్స్ ఇష్టపడుతారు. అలా చేస్తే వాళ్లకు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. కానీ ఇలాంటి శృంగారంలో ప్రైవసీ ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఏకాంతంగా ఉండే ప్రదేశాలను మాత్రమే అలాంటి శృంగారానికి ఎంచుకోవాలి.

3. కొంతమందికి ప్రకృతిని ఆస్వాదిస్తూ శృంగారంలో మైమరిచిపోవడం ఇష్టం.. మరికొందరికి రాత్రివేళ జాబిలమ్మను చూస్తూ వెన్నెల్లో శృంగారాన్ని ఆస్వాదించడం ఇష్టం.. ఇలా కొత్తగా ప్రయత్నించడం దంపతులకు నూతనోత్తేజాన్ని,అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఎప్పుడైనా సరే.. ప్రైవసీని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి.

4. రతిలో రోజూ ఒకే భంగిమలో శృంగారంలో పాల్గొనడం కూడా భాగస్వామికి బోర్ ఫీలింగ్ తెప్పిస్తుంది. కాబట్టి రోజుకొక భంగిమలో శృంగారాన్ని ఆస్వాదిస్తే.. ఇద్దరికీ మంచి ఫీలింగ్ కలుగుతుంది.

5. శృంగారంలో మనస్పర్థలకు తావు ఉండకూడదు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనుకోవడం కంటే.. ఇద్దరూ కలిసి ఆస్వాదిస్తేనే అంతులేని ఆనంద తీరాలకు చేరుతారు.

For All Tech Queries Please Click Here..!
Topics: