నాతో పడుకొంటావా, ఆఫర్ ఇస్తా, నిర్మాతతో యంగ్ హీరోయిన్‌కు చేదు అనుభవం
దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం ఊపందుకోవడంతో హీరోయిన్లపై నిర్మాతలు, దర్శకులు, హీరోల లైంగిక వేధింపులు అదుపులోకి వచ్చాయనే సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడు హీరోయిన్లు ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తమ సమస్యలను చెప్పుకోవడానికి ఛాన్స్ దొరికిన నేపథ్యంలో వేధింపులకు గురయ్యే సంఘటనలు తగ్గిపోతున్నాయి. పలు సినీ పరిశ్రమల్లో కొత్త చట్టాలు, కొత్తరకమైన నిబంధనలు, కమిటీలు ఏర్పాటు చేశారు. దాంతో మహిళా నటులకు అసభ్యకరమైన ప్రపోజల్స్ రావడం తగ్గిపోయాయి. కొంత వరకు లైంగిక వేధింపుల వార్తలు తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఓ చిత్ర యూనిట్‌పై వాణి భోజన్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ఓ చిత్ర యూనిట్ తనతో అసభ్యంగా ప్రవర్తించారు. పడక గదిలోకి వస్తే ఆఫర్ ఇస్తామని అన్నారు. నేను అందుకు ఒప్పుకోకపోవడంతో ఆ సినిమా నుంచి నిర్మాత నన్ను తొలగించారు. ఆ సంఘటన నన్ను మానసికంగా కుంగదీసింది అని వాణి సంచలన విషయాలను బయటపెట్టారు. అయితే ఆ చిత్ర యూనిట్ గురించి గానీ, నిర్మాత గురించిన విషయాలను వెళ్లడించలేదు