దొంగ పని తో దొరికిపోయిన హీరోయిన్, సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు..!

Thursday, April 2, 2020 07:51 AM Entertainment
దొంగ పని తో దొరికిపోయిన హీరోయిన్, సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు..!

బాలీవుడ్ సినిమాల్లో ఎలాగైనా మంచి క్రేజ్ తెచ్చుకోవాలని ఆరాటపడుతున్న ముద్దుగుమ్మ ఊర్వశి రౌటేలా. ఇప్పటికే అక్కడ సనమ్ రేగ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4 లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు దక్కలేదు అనే చెప్పాలి. ఆ సినిమాల్లో అందాలను ఆరబోసినా కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గుర్తింపు మాత్రం రాలేదు. అయితే సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఓ దొంగతనం చేస్తూ దొరికిపోయింది.

వివరాల్లోకి వెళితే ఊర్వశి ఇటీవల ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న కొరియన్ మూవీ పారాసైట్‌ పై తన అభిప్రాయాల్ని సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ ద్వారా తెలియచేసింది. అందులో భాగంగా పారాసైట్ సినిమాలో తనకి బాగా నచ్చిన విషయం ఇదేనంటూ ఆమె చేసిన ట్వీట్‌ పైన ప్రస్తుతం విమర్శల వర్షం కురుస్తుంది. దీనికి కారణం ఏమంటే న్యూయార్క్‌కు చెంది ప్రముఖ రచయిత జేపీ బ్రామర్‌ పారాసైట్‌ సినిమాను ఉద్దేశించి ఓ ట్వీట్‌ చేశాడు. ఆ ట్వీట్‌ను ఊర్వశి కొద్దిగా కూడా మార్చకుండా కాపీ చేసి తన ట్విట్టర్ హ్యండిల్‌పై పేస్ట్‌ చేసి పోస్ట్ చేసింది.

ఊర్వశి వాల్‌పై ఉన్న ఈ కాపీ పేస్ట్ ట్వీట్‌ను చూసిన జేపీ ఊర్వశి చేసిన పనిపై స్పందిస్తూ, ఊర్వశి రౌటేలా కనీసం నా ట్వీట్‌లోని తప్పుల్ని కూడా సరిచేయలేదు. గ్రామర్‌ మిస్టెక్స్‌ను కూడా అలానే కాపీ చేసి పేస్ట్‌ చేసేసిందంటూ చురకలంటిచాడు. ఇక ఇదంత చూసిన నెటిజన్స్ ఊర్వశి తీరుపై మండిపడుతున్నారు. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దొంగ, సొంతంగా రాయలేవా ? కాపీ పేస్ట్‌ చేయడమే పనిగా పెట్టుకున్నవా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఊర్వశి గతంలో కూడా ఓ సారి ఇలాంటే పని చేసిన సంగతి తెలిసిందే.

For All Tech Queries Please Click Here..!
Topics: