కోరికలు తీర్చమని అడిగారు... లొంగలేదని నన్ను ఈ స్థాయికి తెచ్చారు

Sunday, November 24, 2019 06:57 PM Entertainment
కోరికలు తీర్చమని అడిగారు... లొంగలేదని నన్ను ఈ స్థాయికి తెచ్చారు

సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని.. దీని కారణంగా వేధింపులకు గురయ్యామంటూ ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు మీడియా ముందుకు వచ్చారు. తాజాగా నటి మంజరి ఫడ్నిస్ తాను ఎదుర్కున్న లైగింక వేధింపులను బయటపెట్టింది. "ఎన్నో సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, నేను నటించిన సినిమాల కంటే పోగొట్టుకున్న సినిమాలే ఎక్కువ ఉన్నాయి. ఇందుకు కారణం దర్శకనిర్మాతలకు లొంగకపోవడమే, వారి కోరికలు తీర్చలేదని సినిమాల నుండి తొలగించారని" చెప్పుకొచ్చింది.

కేవలం కాస్టింగ్ కౌచ్ కారణంగా భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమా ల్లో అవకాశాలు కోల్పోయానని తెలిపింది. తన కెరీర్ లో చాలా వరకు చిన్న సినిమాల్లోనే నటించేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. అవి బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడం, కాస్టింగ్ కౌచ్ వంటి విషయాల వలన చాలా కాలం డిప్రెషన్ లో ఉండిపోయానని చెప్పింది. ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయని షాకింగ్ కామెంట్స్ చేసింది.

అయితే ఎవరూ బలవంతం చేయరని.. కానీ తన ఆత్మాభిమానా న్ని కోల్పోలేక ఎందరో నిర్మాతల సినిమాలను రిజెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది. కొన్ని కొన్ని సార్లు సినిమాకి సైన్ చేసిన తరువాత కోరికలు తీర్చమని అడిగేవారని.. దీంతో అడ్వాన్స్ గా తీసుకున్న డబ్బుని తిరిగిచ్చేసి సినిమాల నుండి తప్పుకున్నట్లు తెలిపింది. దక్షిణాదికి చెందిన ఓ అగ్ర నిర్మాత తనకు ఫోన్ చేసి సినిమా ఆఫర్ ఇస్తే నాకేంటని అడిగారని.. కష్టపడి పని చేస్తానని చెబితే అది తనకి అనవసరమని చెప్పాడని.. అప్పుడే అతడి తప్పుడు ఉద్దేశం తనకు అర్ధమైందని వెల్లడించింది. అవకాశాల కోసం సెక్స్ కి ఒప్పుకునే అమ్మాయిని కాదని ఇండస్ట్రీలో చాలా మందికి తెలిసే ఉంటుందని.. అందుకే తనకు అవకాశాలు రావడం లేదని సంచలన కామెంట్స్ చేసింది. ఈ బ్యూటీ గతంలో అల్లరి నరేష్ తో కలిసి రెండు చిత్రాల్లో నటించింది. అలానే ఎన్టీఆర్ నటించిన 'శక్తి' సినిమాలో కీలకపాత్ర పోషించింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: