నేను నగ్నంగా నటించినా మా ఆయనకు ఎలాంటి అభ్యంతరం లేదు.

Saturday, May 23, 2020 10:40 AM Entertainment
నేను నగ్నంగా నటించినా మా ఆయనకు ఎలాంటి అభ్యంతరం లేదు.

ఇంత బోల్డ్‌గా మాట్లాడుతుంది ఎవరు ఈ భామ అనుకుంటున్నారా అయితే ఆమెను గుర్తు చేసుకోవడానికి ఓ పదేళ్లు వెనక్కి వెళ్లాలి. 2009లో శర్వానంద్ హీరోగా రాజు మహరాజు అనే సినిమా విడుదలైంది. మోహన్ బాబు, రమ్యక్రిష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలోని సుర్వీన్ చావ్లా హీరోయిన్ గా నటించింది .

తొలి చిత్రం తోనే అందాలను ఆరబోసి శర్వానంద్‌తో రొమాన్స్ కానిచ్చిన ఈ భామ మళ్లీ టాలీవుడ్ లో కనిపించలేదు. అయితే అందాల ప్రదర్శనకు బాగా ప్రాముఖ్యతనిచ్చే బాలీవుడ్‌కి చెక్కేసి హమ్ తుమ్ శబానా అంటూ ప్రేక్షకుల్ని పలకరించింది. ఆ సినిమా తరువాత హేట్ స్టోరీ 2 లో అందాల ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించి ఆఫర్లను అందిపుచ్చుకుంది.

బోల్డ్ పాత్రలతో గ్లామరసం పండించిన ఈ భామ అక్షయ్ తక్కర్ అనే బిజినెస్‌మేన్ ప్రేమలో పడింది. 2015లో అతన్ని పెళ్లాడిన ఈ భామ పెళ్లి తరువాత కూడా చాలా బోల్డ్ పాత్రల్లో మెరిసింది. పెళ్లికి ముందు ఓకే మరి పెళ్లైన తరువాత ఇలాంటి పాత్రలు చేస్తుంటే మీ భర్త ఏం అనడా అని అడగగా అబ్బే మా వారికి అస్సలు అలాంటి ఫీలింగే ఉండదు అంతెందుకు నగ్నంగా నటించినా మా వారికి నథింగ్ ఆయన నన్ను అంతలా అర్థం చేసుకున్నారు. ప్రొఫెషన్ గురించి ఆయనకు బాగా తెలుసు ఏది చేసిన ప్రొఫెషన్‌లో భాగమే కదా, అందులో పర్ఫెక్షన్ ఉండాలి కదా అని మాత్రమే ఇద్దరం ఆలోచిస్తాం అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: