రివ్యూ: స్పైడర్ మ్యాన్: ఇంటూ ది స్పైడర్ వెర్స్
నటీనటులు: శమీయక్ మూర్, జేక్ జాన్సన్, హైలీ స్టెయిన్ ఫైల్డ్, మహీర్షల అలీ
సంగీతం : డేనియల్ పెంబెర్టోన్
దర్శకత్వం : పీటర్ రాంసేయ్, రోడ్నీ రొత్మన్, రాబర్ట్ పెర్సిచెట్టి
నిర్మాత : మార్వెల్, సోనీ పిక్చర్స్ ఏనిమేషన్, కొలంబియా పిక్చర్స్
మార్వెల్ సృష్టించిన సూపర్ హీరో క్యారెక్టర్లలో స్పైడర్ మ్యాన్ చాలా ప్రత్యేకమైన క్యారెక్టర్. గాలిలో ఎగురుతూ, చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేసే ఈ సూపర్ హీరో అంటే పిల్లలతో పాటు పెద్దలకూ ఇష్టమే. మార్వెల్ స్టూడియోస్ ఈసారి సోనీ మోషన్ పిక్చర్స్ సంస్థతో కలిసి పిల్లల కోసం పూర్తిగా యానిమేషన్ ద్వారా రూపొందించిన 'స్పైడర్ మ్యాన్ : ఇంటూ ది స్పైడర్ వెర్స్' ఈ నెల 14న విడుదలై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని అలరిస్తోంది.
కథ :
ఆఫ్రికన్-అమెరికన్ జాతీయుడికి, పుయర్టో రికో దేశస్తురాలికి పుట్టిన పిల్లాడు మైల్స్ మోరేల్స్ ఇక్కడ మన కొత్త స్పైడర్ మ్యాన్. స్పైడర్ కుట్టడంతో అతను కూడ స్పైడర్ మ్యాన్ అవుతాడు. అతను పీటర్ పార్కర్ లాంటి ఇంకొంతమంది స్పైడర్ క్యారెక్టరల్తో కలిసి చెడ్డవాడైన కింగ్ పిన్ దుష్ట చర్యల్ని అడ్డుకుంటాడు.