అవకాశం ఇస్తాను... కానీ ఒక రాత్రంతా నాతో పడుకోవాలి
క్యాస్టింగ్ కౌచ్ భూతం కారణంగా చిన్న నుండి పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్ల వరకు మరెంతో మంది మూవీ ఆర్టిస్టులు తమ జీవితాలను నాశనం చేసుకున్నరని మీటూ ఉద్యమం ద్వారా బయటపడిన సంగతి తెలిసిందే. అవకాశం పేరుతో మహామహులు అమ్మాయిల మానాన్ని దోచుకోవడానికి తహతహలాడారని శ్రీరెడ్డి, చిన్నయి శ్రీపాద వంటి సినిమా ఆర్టిస్టులు మీటు ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. ఇప్పుడే వీరి బాటలో మరో ప్రముఖ సింగర్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది.
ప్రముఖ సింగర్ ప్రణవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ టాలీవుడ్ డైరక్టర్ తన సినిమాలో పాట పాడే అవకాశం కోసం ఒక రాత్రి మొత్తం తనతో గడపాలని కోరాడు. అప్పుడు నేను ఇంటర్ చదివేదానిని. అతడి వయస్సు పెద్దది కావడంతో.. నీ వయసెంత..? నా వయసెంత..? చెంపలు వాయిస్తా అని వార్నింగ్ ఇచ్చి వచ్చేశానని చెప్పింది. ఆ తర్వాత కాలంలో తను నాకు ఎదురుపడ్డా మొహం చాటేసేవాడు. ఇప్పుడు కూడా ఏదైనా సినిమాలో పాట పాడే అవకాశం వస్తే అక్కడ ఉన్న పరిస్థితులను గమనించి పర్వాలేదనిపిస్తేనే పాటలు పాడేందుకు అంగీరించేదాన్ని.
సింగర్ ప్రణవి ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తెలుగులో యమదొంగ, శ్రీరామదాసు, జెంటిల్మెన్, ఒక మనసు, పెళ్లి చూపులు వంటి సినిమాల్లో పాటలు పాడింది.