ప్రముఖ క్రికెటర్‌ను పెళ్లాడనున్న హీరో విశాల్ మాజీ ప్రేయసి..?

Wednesday, May 20, 2020 12:07 PM Entertainment
ప్రముఖ క్రికెటర్‌ను పెళ్లాడనున్న హీరో విశాల్ మాజీ ప్రేయసి..?

సంచలన నటిగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రముఖ క్రికెటర్‌ను పెళ్లాడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నటుడు శరత్‌ కుమార్‌ కూతురు అయిన వరలక్ష్మి పోడా పోడీ చిత్రంలో తమిళ సినిమా ఇండస్ట్రీ లో కథానాయికగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కథానాయకి పాత్రలే కాకుండా ప్రతి నాయకి, ఇతర ప్రాధాన్యత గల పాత్రలను పోషిస్తూ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుకుంటోంది.

అలాంటి నటి త్వరలో పెళ్లి పీఠలెక్కడానికి సిద్ధమవుతుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈమె ఒక ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారుడితో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇండియన్‌ క్రికెట్‌ జట్టులో కొనసాగుతున్న అతను విరాట్‌ కోహ్లి, ధోనీలకు సన్నిహితుడని తెలుస్తోంది. శరత్‌కుమార్‌ కుటుంబానికి, అతని కుటుంబానికి మధ్య కొంత కాలంగా మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నట్టు సమాచారం.

త్వరలోనే వీరి పెళ్లి నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌కు, నటుడు విశాల్‌కు మధ్య ప్రేమాయణం అనే వదంతులు జోరుగా సాగిన విషయం తెలిసిందే. విశాల్‌ హైదరాబ్‌ద్‌కు చెందిన ఒక వ్యాపార వేత్త కూతురితో వివాహ నిశ్చితార్థం జరగడంతో వరలక్ష్మి, విశాల్‌కు మధ్య ప్రేమాయణం వదంతులకు ఫుల్‌స్టాప్‌ పడ్డాయి.

మరో విశేషం ఏమిటంటే నటి రాధిక కూతురు కూడా క్రికెట్‌ క్రీడాకారుడు అభిమన్యు మిథిన్‌ను ప్రేమించి పెద్దల అనుమతితో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. శరత్ కుమార్‌ కుటుంబంలో మరో క్రికెట్‌ క్రీడాకారుడు భాగం కాబోతున్నాడనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ వివాహం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదన్నది గమనార్హం.   


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: