అతనితో అఫైర్ నిజమేనన్న సానియా మీర్జా,.

Thursday, March 19, 2020 07:16 PM Entertainment
అతనితో అఫైర్ నిజమేనన్న సానియా మీర్జా,.

మన హైదరాబాదీ సానియా మీర్జా అంటే అందరికీ టక్కున గుర్తుకొచ్చే ఆట టెన్నిస్. తను టెన్నిస్ ఆడుతున్న సమయంలో మన దేశంలో టెన్నిస్ ఆట అంటే కేవలం సానియా మీర్జా అనేంతలా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. మన దేశంలో టెన్నిస్ గేమ్ కు ఓ గుర్తింపు వచ్చిందంటే ఆ ఘనత కూడా ఈమెకే దక్కుతుంది. అయితే ఈ క్రీడాకారణి ఆటలోనే కాదు, అందం, అభినయం ప్రదర్శించడంలోనూ అందరికీ పోటీ ఇచ్చేది. అయితే వ్యక్తిగత జీవితంలో ఈమె చేసిన తప్పులతో స్పోర్ట్స్ కన్నా ఇతర రకాల పుకార్లలో ఎక్కువగా నిలిచింది. తాజా ఓ ఇంటర్వ్యూలో సానియా మీర్జా మాట్లాడుతూ తన అఫైర్ గురించి చెప్పేసింది.

ఆమె పెళ్లికాక ముందు ఓ బాలీవుడ్ స్టార్ హీరోతో అఫైర్ ఉన్నట్లు తానే స్వయంగా చెప్పిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి ఓ బాలీవుడ్ స్టార్ తో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆ విషయం గురించి ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. బాలీవుడ్ హీరోల్లో మంచి పాపులారిటీ ఉన్న వారిలో షాహిద్ కపూర్ ఒకరు. అతని హ్యాండ్సమ్ గా కనిపించడంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటాడు. అందుకే అతని వలలో అనేక మంది అమ్మాయిలు చిక్కుకున్నట్లు పుకార్లు కూడా వినిపిస్తుంటాయి. అయితే అదే వలలో మన హైదరాబాదీ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా చిక్కుకున్నట్లు అప్పట్లో వార్తలు తెగ హల్ చల్ చేశాయి. ఇదే విషయాన్ని తాజాగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సానియా మీర్జాను అడగగా ఆమె ఆ అఫైర్ గురించి నిజమే అన్నట్లు సమాధానమిస్తూ,. అంతలోనే ఈ టాపిక్ ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. అప్పటి సంగతులు ప్రస్తుతం ఏమీ గుర్తులేవని దాట వేసింది.