సినిమాల్లో రెండో ఇన్నింగ్స్ మదలుపెట్టనున్న రేణుదేశాయ్!

Saturday, July 13, 2019 03:18 PM Entertainment
సినిమాల్లో రెండో ఇన్నింగ్స్ మదలుపెట్టనున్న రేణుదేశాయ్!

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య అయిన రేణుదేశాయ్ తెలుగు సినిమా అభిమానులకి అందరికీ బాగా తెలుసు. అప్పట్లో తన అందచెందాలతో కుర్రకారులో మంచి ఫాలోయింగ్ సంపాయించింది రేణూ. అయితే పవన్‌ కళ్యాణ్ తో విడాకుల తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. ఇక ఆమె మరో పెళ్లి చేసుకొని సెటిల్ అవుదామని అనుకుంటోందని సోషల్ మీడియాలో పెద్ద హంగామానే జరిగింది.

ఇన్ని రోజులు టీవీ షోలకే పరిమితమైన రేణుదేశాయ్ మళ్లీ సినిమాల్లోకి వస్తుందని వార్తలు చాలా సార్లు వచ్చాయి కానీ అది జరగలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం రీ ఎంట్రీ దాదాపు ఫిక్స్ అయిపోయిందని ఇక అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉందని ఫిల్మ్‌నగర్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. స్టువర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావ్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించేందుకు గాను రేణూను సంప్రదించారట. రచయిత సాయి మాధవ్ మాట్లాడుతూ ఈ సినిమాలో రేణు దేశాయ్‌ని ఒక పాత్ర కోసం అనుకున్నామని త్వరలోనే ఆ విషయమై అఫీషియల్ ప్రకటన విడుదల చేస్తామన్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: