ఆర్జీవీ కొత్త సినిమా కరోనా వైరస్ : రోగం కంటే ట్రైలరే భయంకరంగా ఉంది!

Tuesday, May 26, 2020 07:22 PM Entertainment
ఆర్జీవీ కొత్త సినిమా కరోనా వైరస్ : రోగం కంటే ట్రైలరే భయంకరంగా ఉంది!

రామ్ గోపాల్ వర్మ ఈ పేరు సంచలనాలకు మారుపేరు. క్లైమాక్స్ సినిమా పేరిట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న వర్మ మరో సంచలన చిత్రాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. కరోనా వైరస్ అంటూ తనదైన శైలిలో ఓ చిత్రాన్ని తీశాడు. ఈ మేరకు తాజాగా రిలీజ్ చేసిన కరోనా వైరస్ ట్రైలర్ చాలా భయంకరంగా ఉంది. అ ట్రైలర్ చూస్తే కరోనాకు కూడా భయం వేసేలానే ఉంది.

ప్రస్తుతం ప్రపంచం అంతా కరోనా వైరస్ గుప్పిట్లో చిక్కుకుని ఎన్నో లక్షల మంది బలయ్యారు. ప్రత్యక్షంగానో పరోక్షంగా ప్రతీ ఒక్కరూ కరోనాకు బలయ్యారు. ప్రస్తుతంఉన్న పరిస్థితుల నేపథ్యంలో కరోనా వైరస్ చిత్రాన్ని తెరకెక్కించాడు వర్మ. ఈ కథ లాక్‌డౌన్‌లో పుట్టింది.. లాక్‌డౌన్‌కలోనే షూట్ చేశాము.. మా పనిని దేవుడు కాదు కదా కరోనా లాంటివి కూడా ఆపలేవని నిరూపించడానికే ఇది చేశా అని ట్వీట్ చేసారు వర్మ. ఓ ఇళ్లు, ఆ ఇంటి సభ్యులు, లాక్ డౌన్ కాలం, కరోనా కేసుల విపరీతంగా పెరిగిపోతూ ఉంటే.. ఆ కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో చెప్పేలా ట్రైలర్ ఉంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: