యాంకర్ సుమ, రాజీవ్ కనకాల ఇంట్లో తీవ్ర విషాదం..

Monday, April 6, 2020 05:09 PM Entertainment
యాంకర్ సుమ, రాజీవ్ కనకాల ఇంట్లో తీవ్ర విషాదం..

ప్రముఖ నటుడు రాజీవ్‌ కనకాల సోదరి శ్రీలక్ష్మీ కనకాల మృతి చెందారు. కొద్దికాలంగా  తీవ్ర అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నారు. ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాసు కనకాల ఏకైక కుమార్తె ఈమె. కాగా శ్రీలక్ష్మి భర్త సీనియర్ జర్నలిస్ట్ పెద్ది రామారావు. ఆమె సోదరుడు రాజీవ్ కనకాల. శ్రీలక్ష్మి కి ఇద్దరు ఆడపిల్లలు.గతకొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె సోమవారం ఓ ‍ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె పలు టీవీ సీరియల్స్‌లో నటింటి మంచి నటిగా గుర్తింపుపొందారు. కాగా రాజీవ్‌ కనకాల తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందిన విషయం తెలిసిందే.

For All Tech Queries Please Click Here..!
Topics: