పీకే లవ్ అంటూ పూనమ్ ట్వీట్.. అయోమయంలో నెటిజన్స్
కావాల్సినంత అందం ఉన్నా, అదృష్టం అంతగా లేని భామ పూనమ్ కౌర్. హీరోయిన్ మెటీరియల్ అయినా కూడా ఆ రేంజ్ అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. అడపాదడపా చిత్రాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు కానీ పవన్ కళ్యాణ్ వ్యవహారంలోకి పూనమ్ ఎంటరైనప్పటి నుంచి ఓ వెలుగు వెలిగింది. పవన్-పూనమ్‌కు మధ్య ఏదో సంబంధం ఉందని కత్తి మహేష్ ఆరోపించడంతో ఆ వార్తలు సంచలనం సృష్టించాయి.పవన్ కళ్యాణ్‌కు, పూనమ్ కౌర్‌కు మధ్య ఎలాంటి సంబంధం లేకుండా ఆమె ఆస్పత్రి బిల్స్ పవన్ ఎందుకు కట్టారు? ఇద్దరూ కలిసి పూజలు ఎందుకు చేశారు? అని కత్తి మహేష్ ప్రశ్నలు విసిరారు. తాను ఓ కవిత రాశానని, దాన్ని తన స్నేహితుడు తెలుగులోకి అనువదించాడని చెబుతూ.‘డబ్బు హోదా ఉన్నవాడు రాజు అవ్వొచ్చు కానీ ప్రేమ త్యాగం న్యాయం కోసం పోరాడేవ్యక్తి వీరుడవుతాడు. రాజులు శాసిస్తారు. వీరులు మిమ్మల్నికాపాడుతారు. శాసించాలి అని తపనవాడికి అహంకారం ఉంటుంది. అందరూ బాగుండాలనుకునే వ్యక్తులలో ప్రేమ, వైరాగ్యం ఉంటుందని పీకే లవ్, జై హింద్ అనే హ్యాష్ ట్యాగ్‌లతో పోస్ట్ చేసింది.