ఏందబ్బా.. ముద్దు పెడితే ఏడుస్తారబ్బా!

Saturday, February 15, 2020 02:05 PM Entertainment
ఏందబ్బా.. ముద్దు పెడితే ఏడుస్తారబ్బా!

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మూవీ లవ్ స్టోరీ. ఈ సినిమాను ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె. నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. వాలంటైన్స్ డే స్పెషల్‌గా విడుదల చేసిన ఒక నిమిషం వీడియో సాంగ్ ఏయ్ పిల్లా మ్యూజికల్ ప్రివ్యూకు మంచి స్పందన వస్తోంది. మొదటి ముద్దుకు నాగచైతన్య పలకించిన హావభావాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సెన్సిబుల్ లవ్ స్టోరీస్‌ని బలంగా చూపించడంలో మాస్టర్ అయిన శేఖర్ కమ్ముల తెరమీద కురిపించబోతున్న ఈ ప్రేమలో తడిచేందుకు ప్రేక్షకులను సిద్ధం చేసింది ఈ సాంగ్ .

రెహమాన్ స్కూల్ నుండి వచ్చిన పవన్ అందించిన స్వరాలు ఈ ప్రేమకథను మరింత హృద్యంగా మార్చబోతున్నాయి. ‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమానులు, ప్రేక్షకుల్లో అమితాసక్తిని కలిగిస్తోంది. ఈ ప్రేమకథ సమ్మర్‌కి స్పెషల్ అట్రాక్షన్‌గా మారుతోంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: