ఆంగ్లం వద్దు హిందీనే ముద్దు అంటున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ
హిందీ భాషపై నటి కంగనారనౌత్ ప్రేమను ఒలకబోస్తోంది. ఆంగ్లం వద్దు హిందీనే ముద్దు అని అంటోంది. ఏదో ఇక చర్చనీయాంశ వ్యాఖ్యలతో వార్తల్లో ఉండడం ఈ అమ్మడి నైజంగా మారింది. బాలీవుడ్లో ప్రముఖ కథానాయకిగా వెలిగిపోతున్న ఈ జాణ ఇప్పటికే కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో నటించేసింది. తాజాగా హిందీ చిత్రం పంగాతో తెరపైకి రానుంది. కాగా త్వరలో మరోసారి తలైవి చిత్రం ద్వారా ఉత్తరాదితో పాటు దక్షిణాది ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.
అవును ప్రఖ్యాత నటీమణి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో నటిస్తోంది. ఇందుకోసం తగిన శిక్షణ కూడా తీసుకున్నట్లు కంగనారనౌత్ పేర్కొంది. కాగా ఇటీవల హిందీ భాషాదినోత్సం సందర్భంగా ఒక వీడియోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. అందులో హిందీ మన జాతీయ భాష అని అయితే ఈ భాషలో మాట్లాడడానికి మన దేశం చాలా సంకోచిస్తోందని పేర్కొంది. ఆంగ్ల భాషకు చెందిన ఏబీసీడీలను నమ్మకంగా చెబుతున్నారని, అదే హిందీ భాషలో మాట్లాడడానికి సంకట పడుతున్నారని అంది.