అందుకే నాగబాబుకు దూరం నాకు బలుపు అనుకొంటే మీఇష్టం, వివాదంపై ఆది హాట్ కామెంట్

Wednesday, April 8, 2020 06:35 PM Entertainment
అందుకే నాగబాబుకు దూరం నాకు బలుపు అనుకొంటే మీఇష్టం, వివాదంపై ఆది హాట్ కామెంట్

తెలుగు టెలివిజన్ రంగంలో రియాలిటీ షోల క్రేజ్ ని మార్చేసినదేమైనా ఉందటే అది జబర్దస్త్ మాత్రమే. ఆ షో ద్వారా ప్రేక్షకులు వినోదాన్ని పొందడం వలన అత్యంత ప్రజాదరణను కట్టబెట్టారు. ఇలాంటి క్రమంలో జబర్దస్త్ అంటే ఠక్కున గుర్తొచ్చేది కమెడియన్ ఆది. ఆయన స్కిట్స్‌కు మంచి ఆదరణ ఉంది. దాంతో జబర్దస్త్ లో టాప్ కమెడియన్ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకొన్నారు. ఈ క్రమంలో అదిరింది షో పోటీగా రావడం, దానికి నాగబాబు వెళ్లడం కొంత గందరగోళంగా మారింది. ఈ క్రమంలో నాగబాబు గురించి ఆది ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

వివరాలలోకి వెళితే అదిరింది షో స్టార్ట్ అయినా జబర్దస్త్‌కు ఎలాంటి దెబ్బ తగల్లేదు. కారణం కటెంట్ మాత్రమే. అదిరింది పోటీగా ఉన్న అక్కడ పాల్గొనే వాళ్లందరూ మాకు సన్నిహితులే. నాగబాబు అదిరింది షోకు వెళ్లినా ఆయన మాకు ఎప్పుడూ ప్రోత్సాహం అందిస్తుంటారు. మీరు బాగా చేయాలి, మనవాళ్లంత బాగా చేయాలి అని నాగబాబు మెసేజ్ పెట్టారు అని ఆది చెప్పారు. అదిరింది షో కోసం నన్ను అడిగారు. కానీ అక్కడ ఉన్న కొన్ని పరిస్థితుల, వ్యక్తుల వల్ల నేను వెళ్లలేదు. కొందరు వ్యక్తుల వల్ల నేను నాగబాబుతో కలిసి ఉండలేకపోయినా రెగ్యులర్‌గా ఆయనతో మాట్లాడుతుంటాను. జబర్దస్త్ వల్ల మాకు బాగా ప్రజాదరణ లభించింది. మాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మాకు ఫ్యాన్స్ ఉన్నారంటే ఒప్పుకొను. కాకపోతే మమ్మల్ని ఇష్టపడే వాళ్లు ఉంటారు. నా స్వభావాన్ని చూసి కొంత మంది డౌన్ టూ ఎర్త్ అని, నా మాట్లాడే తీరు వల్ల కొంతమంది నాకు బలుపు అనుకొంటారు అని ఆది పేర్కొన్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: