‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ క్రేజ్.. బుకింగ్‌లో రికార్డ్
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపైన తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కీలక సంఘటనలకు సంబంధించిన అసలు నిజాలను ఈ సినిమాతో చూపిస్తానని వర్మ చెప్పటం అదేవిదంగా టీడీపీ నాయకులు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని విడుదల కాకుండా ఆపేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో సినిమా మీద ప్రేక్షకుల బాగా ఆసక్తి పెరిగింది. అదే క్రేజ్ టికెట్ల అమ్మకాల్లోనూ కనిపిస్తుంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
బుకింగ్స్ ప్రారంభించిన 10 నిమిషాల్లో కేవలం ఒక్క థియేటర్లోనే 1000 టికెట్లు అమ్ముడైనట్టుగా వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. "ఈ ఓపెనింగ్స్ స్పీడ్ చూస్తుంటే కథానాయకుడు, మహానాయకుడు కన్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని చూడడానికే ప్రజలు ఎగబడుతున్నారు, అంటే నిజంగా నిజమే గెలిచిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. జై బాలయ్య" అంటూ ట్వీట్ చేశాడు వర్మ. హైదరాబాద్‌లోని ఏయంబీథియేటర్ బుకింగ్స్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను కూడా జోడించాడు వర్మ. టికెట్స్ కొన్నవారందరూ అసలైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నారు వర్మ.