పెళ్లి చేసుకోలేదు నీకు ప్రాబ్లం ఉందా అని అడిగిన స్టార్ కమెడియన్, అప్పుడు మీ చెల్లిని పంపిస్తారా అని అడిగా.

Tuesday, May 5, 2020 10:24 AM Entertainment
పెళ్లి చేసుకోలేదు నీకు ప్రాబ్లం ఉందా అని అడిగిన స్టార్ కమెడియన్, అప్పుడు మీ చెల్లిని పంపిస్తారా అని అడిగా.

అమృతం సీరియల్ పేరు వినగానే మనకి గుర్తొచ్చే వారిలో హర్షవర్ధన్ ఒకరు. నటుడిగా రైటర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్ గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. మనం, గుండెజారి గల్లంతయ్యిందే అనే సినిమాలకు రైటర్ గా కూడా చేశారు. కెరీర్ లో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని హర్షవర్ధన్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నాడు. ముఖ్యంగా ఆయన పెళ్లి చేసుకోలేదన్న విషయం బయట చాలా మందికి తెలియదు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకి అయన వివరణ ఇచ్చారు.

హర్షవర్ధన్ పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. మనం ఎదో సాధించాలని ఇండస్ట్రీకి వస్తాము. మనల్ని నమ్మి మనతో వచ్చే వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఆమెకు నచ్చినట్లుగా నేను ఉండలేను. సరైన సమయాన్ని కూడా కేటాయించలేనని అందుకే పెళ్లి చేసుకోలేదని తన మనసులోని విషయాన్ని బయటపెట్టారు.  పెళ్లి చేసుకోకపోతే చాలా మంది ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అని అడుగుతూ ఉంటారు. ఇలానే ఒక కమెడియన్ నాతో ఇన్ డైరెక్ట్ గా అలానే అడిగాడు. ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడిగితే నేను కెరీర్ కోసమని చెప్పా, అందుకు ఆయన అదొక బాధ్యత అంటూ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నీలానే అంటే ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అని ఆడిగేసానని ఆయన అన్నాడు. అదే తరహాలో తను కూడా ఒక కౌంటర్ ఇచ్చినట్లు హర్షవర్ధన్ చెప్పాడు. కమెడియన్ వేసిన సెటైర్ కి నాకు కోపం వచ్చింది. వెంటనే ఒక చురుకైన సమాధానం ఆయనకు తగిలేలా అలానే చెప్పాను. నన్ను కూడా ఒక వ్యక్తి ఇలానే అడిగాడు సార్ వెంటనే అతని చెల్లిని లేదా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పంపిస్తే విషయం ఉందొ లేదో తెలిసేలా చేస్తానని ఆడిగేసాను సర్ అంటూ ఆ స్టార్ కమెడియన్ కి సమాధానం చెప్పినట్లు హర్షవర్ధన్ వివరణ ఇచ్చాడు. 


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: