20 రోజుల పాటు ఒంటిపై నూలు పోగు లేకుండా నటించింది..!
అమలాపాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఆమె సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది, అయితే ఈ టీజర్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇంత ఆదరణ రావడానికి కారణం అమలాపాల్ నగ్నంగా నటించటం అని విశ్లేషకులు అంటున్నారు. నగ్న దృశ్యాల కోసం అమలాపాల్ ఏకంగా 20 రోజుల పాటు ఒంటిపై నూలు పోగు లేకుండా నటించిందట. ఆమె సినిమా టీజర్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియా లో ట్రేండింగ్ లో అగ్ర స్థానం లో కొనసాగుతోంది . ఈ సినిమా టీజర్ కు అనూహ్య రీతి లో ఆదరణ లభిస్తుండడంతో , సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
మహిళ స్వేచ్ఛ, సంప్రదాయాల గురించి చర్చించే ఈ సినిమాలో నగ్న దృశ్యాలు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. నగ్న దృశ్యాలు కథకు అనుగుణంగా వస్తాయని మారీ చెండాలంగా ఉండకుండా ఆర్టిస్టిక్ గా చిత్రీకరించడం తో ఈ సినిమా విమర్శకుల నుండి ప్రశంసలు కూడా పొందడం ఖాయమని సినీ పరిశీలకులు అంటున్నారు. దీన స్థితిలో లో ఉన్న మహిళ ఆవేదనను కళ్ళకు కట్టేవిధంగా చూపించిన ఆమె చిత్ర టీజర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.