తల్లయిన అందాల హీరోయిన్.. 42 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చింది

Tuesday, May 19, 2020 03:50 PM Entertainment
తల్లయిన అందాల హీరోయిన్.. 42 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చింది

సాక్షి, చెన్నై : ఎంత పేరు, ప్రఖ్యాతి సంపాదించినా, మాతృత్వంతో కలిగే ఆనందమే వేరు. అలాంటి కమ్మనైన అమ్మతనాన్ని నటి సంఘవి 42 ఏళ్ల వయసులో అనుభవిస్తోంది. 1990 ప్రాంతంలో కథానాయికగా వెలిగిన నటి సంఘవి. 1993లో అమరావతి చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు కథానాయకిగా పరిచయం అయిన నటి సంఘవి. ఆ తరువాత తమిళం, తెలుగు, కన్నడ అంటూ దక్షిణాది లో పలు చిత్రాల్లో నటించింది. కాగా ఈమె 2016లో వెంకటేశ్‌ అనే సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుంది.

ఆ తరువాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న సంఘవి ఇటీవల కాలంలో నటిగా రీఎంట్రీ అయింది. కాగా 42 ఏళ్ల వయస్సులో నటి సంఘవి అమ్మ అయింది. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డతో మాతృత్వ ఆనందాన్ని పొందుతున్న దృశ్యాన్ని వీడియోలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: