పిచ్చ హాట్‌గా నటి ప్రగతి.. మతిపోగొట్టే యోగాసనాలు!

Wednesday, April 22, 2020 04:35 PM Entertainment
పిచ్చ హాట్‌గా నటి ప్రగతి.. మతిపోగొట్టే యోగాసనాలు!

టాలీవుడ్ లో నటి ప్రగతి తల్లి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ప్రగతి.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతోంది. తల్లి, అత్త, సోదరి పాత్రలకు ప్రగతి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది. హీరోయిన్లకు, హీరోలకు తల్లి పాత్రలు ఉంటే దర్శక నిర్మాతలు ముందుగా ప్రగతినే సంప్రదిస్తున్నారు. 

సెంటిమెంట్ తో పాటు ప్రగతి కామెడీ పండించడంలో కూడా దిట్ట. దీనితో ప్రగతికి మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ప్రగతి యాక్టివ్. గ్లామర్ విషయంలో కూడా ప్రగతి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుంది. కుర్ర హీరోయిన్ల తరహాలో ప్రగతి టాటూలతో రచ్చ చేస్తోంది. డాన్సలతో దుమ్మురేపుతోంది. అంతే కాదు ఈ వయసులో ఫిట్ నెస్ కోసం యోగాసనాలు కూడా చేస్తోంది. తాజాగా ప్రగతి ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసిన యోగాసనాలు పిక్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఆమె యోగ ఫీట్లు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వయసులో కూడా ప్రగతి శరీరాన్ని రబ్బరు బొమ్మలా వంచుతోంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: