ప్రముఖ నటి మృతి.. తమ్ముడు మరణించిన మూడు రోజులకే!

Saturday, April 25, 2020 07:09 AM Entertainment
ప్రముఖ నటి మృతి.. తమ్ముడు మరణించిన మూడు రోజులకే!

వరసగా నటులు, దర్శకులు మరణిస్తూనే ఉన్నారు. గత నెల రోజుల్లోనే దాదాపు ఆరుగురు చనిపోయారు. ఇప్పుడు మరో ప్రముఖ నటి కన్ను మూసారు. బెంగాలిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఉషా గంగూలీ గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. తన ఫ్లాట్‌లో ఉషా గంగూలీ చలనం లేకుండా పడిపోయి ఉండడం గమనించిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఆమె భర్త కమలేందు కొన్నేళ్ల క్రితం మరణించారు.

ఆమె సోదరుడు మూడు రోజుల ముందే మరణించడం ఇక్కడ విషాదం. అంతలోనే ఉషా గంగూలీ కూడా చనిపోవడంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు.. చిత్ర పరిశ్రమకి ఆమె చేసిన కృషిని గుర్తు చేసుకున్న మమతా 2016లో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఉషా గంగూలీకి గిరీష్ సమ్మన్ గౌరవాన్ని అందజేసిందని చెప్పారు. ఉషా కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేసారు మమతా బెనర్జీ. షబానా ఆజ్మీ, అపర్ణా సేన్ లాంటి సినీ ప్రముఖులు ఉషా మృతిపై సంతాపం వ్యక్తం చేసారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: