ముగ్గురు మహిళల అర్ధనగ్న ఊరేగింపు.

Thursday, May 7, 2020 10:27 AM Crime
ముగ్గురు మహిళల అర్ధనగ్న ఊరేగింపు.

ముజఫర్‌పూర్ జిల్లాలోని హతౌది పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దక్రామా గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు గ్రామంలోని ఓచోట కొన్ని పూజలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. మంత్రాలు చేస్తున్నారన్న నెపంతో వారిని పట్టుకుని కట్టేసి గుండు కొట్టి.. అర్ధనగ్నం గా మార్చి గ్రామంలో ఊరేగించారు. బలవంతంగా మూత్రం కూడా తాగించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది షాక్‌కి గురయ్యారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు శ్యామ్ సహానితో పాటు మరో 9 మందిని అరెస్ట్ చేశామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ఆరుగురు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఘటనపై గ్రామస్తులు గానీ,బాధితులు గానీ తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విచారణలో పూర్తి నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: