ఇంట్లో బోర్ కొడుతోందని ప్రాణం తీసుకున్న అమ్మాయి

Wednesday, April 29, 2020 04:27 PM Crime
ఇంట్లో బోర్ కొడుతోందని ప్రాణం తీసుకున్న అమ్మాయి

లాక్ డౌన్‌తో ఇంట్లో ఉండి బోర్ కొడుతోందని యువతి ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కలకడ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో జరిగింది. యువతి విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో నీట్ కోచింగ్ తీసుకుంటోంది. లాక్‌డౌన్ అమలు చేయడంతో ఏప్రిల్ 3వ తేదీ ఇంటికి వెళ్లింది రంజిత. 

కోచింగ్ సెంటర్లో పరిచయమైన స్నేహితులతో రోజూ గంటల కొద్దీ మాట్లాడేది. అయితే మంగళవారం ఫ్రెండ్స్ ఎవరూ ఫోన్ మాట్లాడటానికి అందుబాటులో లేకపోవడంతో.. మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నెలరోజుల నుంచి ఇంట్లోనే కూర్చుని ఉండలేకపోతున్నానని లాక్ డౌన్ ఎత్తేస్తే కాలేజీకి వెళ్లిపోతానని ఇరుగు పొరుగు వారి దగ్గర అనేకసార్లు ప్రస్తావించింది రంజిత.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: