VIDEO: పోలీసును గుద్దేసి రోడ్డు మీద దారుణంగా ఈడ్చుకెళ్లారు..

Saturday, May 2, 2020 07:16 PM Crime
VIDEO: పోలీసును గుద్దేసి రోడ్డు మీద దారుణంగా ఈడ్చుకెళ్లారు..

కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు విధులు నిర్వహిస్తోన్న పోలీసు అధికారిపై ఓ యువకుడు దారుణ ఘటనకు పాల్పడ్డాడు. పంజాబ్‌లోని జలంధర్‌ ప్రాంతంలోని మిల్క్‌బర్ చౌక్ వద్ద లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి కారులో ఓ యువకుడు రోడ్డుపై తిరుగుతున్నాడు. దీంతో కారుని ఆపాలని ఓ పోలీసు అధికారి సూచించాడు.

కారు ఆపకపోవడమే కాకుండా ఆయనపైకి కారును తీసుకెళ్లేందుకు యువకుడు ప్రయత్నించాడు. దీంతో కారు ముందు భాగంపై ఆ పోలీసు అధికారి పడ్డాడు. దీంతో ఆ యువకుడు కారుని అలాగే కొన్ని మీటర్లు ముందుకు పోనిచ్చాడు.
వెంటనే అక్కడున్న ఇతర పోలీసులు ఆ కారును వెంబడించారు. ఆ యువకుడు కారు ఆపిన వెంటనే అతడిని కొడుతూ పోలీసు స్టేషన్‌కు తీసెకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని జలంధర్ పోలీసు అధికారి సుర్జీత్ సింగ్ తెలిపారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: