అతి శుభ్రతతో ప్రాణాలు కోల్పోయిన భార్య భర్తలు

Thursday, February 20, 2020 04:17 PM Crime
అతి శుభ్రతతో ప్రాణాలు కోల్పోయిన భార్య భర్తలు

అతి శుభ్రతతో ప్రాణాలు కోల్పోయిన భార్య భర్తలు, ఆనాధలు గా మిగిలిపోయిన ఇద్దరు చిన్నారులు రోజుకు 10 సార్లు స్నానం చేయాలి. కరెన్సీ నోట్లను కడిగి ఆరబెట్టాలి. ఇంట్లోకి ఎవరొచ్చినా స్నానం చేసే అడుగు పెట్టాలి. ఇవి ఆ భార్య పెట్టిన కండిషన్లు..! ఎక్కడికి వెళ్లినా.. అతి శుభ్రత..! ఏం చేసినా అతి శుభ్రత..! ఈ స్వచ్ఛతా టార్చర్‌ని భరించలేని ఆ భర్త.. భార్యను నరికిచంపాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నాటకలోని మైసూర్‌లో ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే శాంతమూర్తి (40), పుట్టమణి (38) దంపతులకు 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 12, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. ఐతే పుట్టమణి ప్యూరిటనిజాన్ని ఎక్కువగా అనుసరించేది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకునేది. కాలకృత్యాలకు వెళ్లినా. బయటి వ్యక్తులను ముట్టుకున్నా. స్నానం చేయాలని భార్తా పిల్లలకు కండిషన్లు పెట్టేది. అలా వారంతా రోజుకు కనీసం 10 సార్లు స్నానం చేయాల్సి వచ్చేది. అన్ని సార్లు స్నానం చేయడం వల్ల పిల్లలు చాలాసార్లు అనారోగ్యానికి గురయ్యారు. ఐనా అస్సలు వినేది కాదు. అంతే కాదు చివరకు కరెన్సీ నోట్లను కూడా పుట్టమణి కడిగేది. నోట్లను సబ్బు నీటితో శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టేది. ఆమె అతిశుభ్రత వలన భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మంగళవారం దంపతులిద్దరు పొలం పనులకు వెళ్లారు. అక్కడ కూడా ఈ శుభ్రత విషయంలో వాగ్వాదం జరిగింది. భార్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శాంతమూర్తి.. పొలంలో ఉన్న కొడవలితో పుట్టమణిని నరికాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయిన శాంతమూర్తి.. ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయాడు. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకు.. ఫ్యాన్‌కు వేలాడుతూ అతడు కనిపించాడు. తీవ్ర భయభ్రాంతులకు లోనైన చిన్నారులు, చుట్టు పక్కల స్థానికులకు ఇంటికి తీసుకొచ్చారు. అతడు చనిపోయాడని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపించారు. పుట్టమణి కోసం గాలించగా ఆమె కూడా పొలంలో శవమై కనిపించింది

For All Tech Queries Please Click Here..!
Topics: