ఇల్లు ఖాళీ చేస్తావా.. రేప్ చేయమంటావా.. లేడీ డాక్టర్‌కు బెదిరింపు

Monday, March 30, 2020 07:44 PM Crime
ఇల్లు ఖాళీ చేస్తావా.. రేప్ చేయమంటావా.. లేడీ డాక్టర్‌కు బెదిరింపు

కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి ప్రజలు చేతులెక్కి మొక్కుతున్నారు. ఇళ్ల నుంచి బయటికొచ్చి చప్పట్లు మోగించి వారికి ధన్యవాదాలు చెప్పారు. అయితే కొంతమంది మాత్రం వైద్యసిబ్బంది పట్ల దారుణంగా ప్రవర్తించటం గమనార్హం. ఇళ్లు ఖాళ్లీ చేయించాలని, మీ వల్ల మాకు కూడా కరోనా వస్తుందని తిట్టపోస్తున్నారు. దీంతో డాక్టర్లు, నర్సుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికిప్పుడు ఇళ్లు ఖాళీ చేయడం సాధ్యం కాదని వారు  వాపోతున్నారు.

వివరాలలోకి వెళితే ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో పనిచేస్తున్న ఓ లేడి డాక్టర్‌కు ఇలాంటి అనుభవం ఎదురైంది. హౌసింగ్ సొసైటీలోని ఫ్లాట్‌లో నివసిస్తూ, అక్కడే ఆస్పత్రి నిర్వహిస్తున్న ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని స్థానికులు ఆమెను బెదిరిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు కరోనా ఉంటే తమకు అంటుకుంటుందని చెబుతున్నారు. సొసైటీలో ఆఫీస్ లో పనిచేస్తున్న వ్యక్తి మరింత దారుణంగా వ్యవహరించారు. ఖాళీ చేయకపోతే లైంగికదాడి చేస్తానని ఆమెను బెదిరించాడు. నాకు అసలే అమ్మాయిలంటే పిచ్చి తర్వాత నీ ఇష్టం అని బెదిరించాడు. దీంతో ఆ డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

For All Tech Queries Please Click Here..!
Topics: