కరోనా రోగిని తరలించే అంబులెన్స్ ధర కిలో మీటర్‌కు ఇంతా?

Thursday, July 9, 2020 03:32 PM Crime
కరోనా రోగిని తరలించే అంబులెన్స్ ధర కిలో మీటర్‌కు ఇంతా?

కరోనా పేషెంట్‌ను తరలించినందుకు భారీగా సోమ్ము దండుకున్న ఓ అంబులెన్స్ నిర్వహకుడిపై పూణె పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడికి కరోనా సోకిందని తెలిసి కేవలం 7 కి.మీ.ల దూరంలో ఉన్న ఆస్పత్రికి అతడిని తరలించేందుకు సదరు నిర్వహకుడు ఏకంగా రూ. 8000 పుచ్చుకున్నాడు.

పోలీసుల వివరాల ప్రకారం బిబ్వేవాడీ ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో బాధితుడికి కరోనా నిర్ధారణ టెస్టు జరపగా పాజిటివ్ అని తేలింది. దీంతో అతడు ఎరండ్వానే ప్రాంతంలో ఉన్న దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చేరేందుకు సిద్ధమైయ్యాడు. అతడికి పరీక్ష నిర్వహించిన  ప్రదేశానికి ఇది 7 కిమీల దూరంలో ఉంది.

దీంతో అక్కడికి వెళ్లేందుకు అతడు అంబులెన్స్ సేవలను వినియోగించుకున్నాడు. ఫలితంగా అతడు ఏకంగా 8 వేల రూపాలయలు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో బాధితుడి నుంచి డబ్బు వసూలు చేసిన అంబులెన్స్ నిర్వహకుడిపై జిల్లా అధికారులు విపత్తు నిర్వహణ చట్టం, మోటార్ వాహనాల చట్టం కింద కేసు నమోదు చేశారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: