#Tata Altroz XM: త్వరలో టాటా ఆల్ట్రోజ్ ఎక్స్‌ఎమ్ ప్లస్.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి 

Friday, December 18, 2020 01:15 PM Business
#Tata Altroz XM: త్వరలో టాటా ఆల్ట్రోజ్ ఎక్స్‌ఎమ్ ప్లస్.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి 

భారతీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ త్వరలో టాటా ఆల్ట్రోజ్ ఎక్స్‌ఎమ్ ప్లస్ వేరియంట్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కాగా ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన టాటా ఆల్ట్రోజ్ వేరియంట్ విజయవంతం అయిన నేపథ్యంలో మరిన్ని అడ్వాన్సుడ్ ఫీచర్లను జోడించి దీన్ని లాంచ్ చేయనున్నట్లు టాటా మోటార్స్ సంస్థ ప్రకటించింది. అంతేకాక, ఇటీవలే హ్యుందాయ్ నుంచి ప్రీమియం హ్యాష్బ్యాక్ శ్రేణిలో విడుదలైన ఐ20కి పోటీగా ఈ ఆల్ట్రోజ్ ఎక్స్ఎమ్ ప్లస్ను అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్ ఇంజన్తో కూడిన కొత్త- టాటా ఆల్ట్రోజ్ భారత మార్కెట్లో రూ .6.60 లక్షలు(ఎక్స్-షోరూమ్, Delhi ఢిల్లీ)కు లభిస్తుంది.

టాటా ఆల్ట్రోజ్ ఎక్స్‌ఎమ్ ప్లస్ వేరియంట్‌లో ఆపిల్ కార్ ప్లేతో పాటు 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ సపోర్ట్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. దీనిలో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వాయిస్ అలర్ట్, వాయిస్ కమాండ్ రికగ్నిషన్, స్టైలిష్ వీల్ కవర్, 16 -అంగుళాల అల్లాయ్ వీల్, రిమోట్ ఫోల్డబుల్ కీని కూడా పొందుపర్చింది. కాగా కొత్త ఆల్ట్రోజ్ ఎక్స్ఎమ్ ప్లస్ డెలివరీని డిసెంబర్ నెల నుంచి ప్రారంభించే అవకాశం ఉంది.

గ్లోబల్ ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్తో..

టాటా ఆల్ట్రోజ్ ఎక్స్ఎమ్ ప్లస్ వేరియంట్ హై స్ట్రీట్ గోల్డ్, డౌన్టౌన్ రెడ్, అవెన్యూ వైట్, మిడ్ టౌన్ గ్రే వంటి మొత్తం 4 కలర్ వేరియంట్లలో లభిస్తుంది. సాధారణంగా ప్రీమియం వేరియంట్లలో మాత్రమే లభించే అడ్వాన్సుడ్ ఫీచర్లను ఎక్స్ఎమ్ ప్లస్తో అందుబాటు ధరలోనే అందజేస్తుండటం విశేషం. టాటా ఆల్ట్రోజ్ ఎక్స్ఎమ్ ప్లస్ వేరియంట్ విడుదల గురించి టాటా మోటార్స్, హెడ్ మార్కెటింగ్, ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ (పివిబియు) వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ, “ మా వినియోగదారులకు కొత్త ఉత్పత్తులను అందించేందుకు గాను ఈ కొత్త ఆల్ట్రోజ్ ఎక్స్ఎమ్ ప్లస్ను ప్రారంభింస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఆల్ట్రోజ్‌తో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ బార్‌ను పెంచడమే కాక, పరిశ్రమలో సరికొత్త బెంచ్‌మార్క్‌ను కూడా సృష్టించాము. 

ఈ నూతన XM + వేరియంట్ వినియోగదారులకు అందుబాటు ధరలోనే పలు రకాల ప్రీమియం ఫీచర్లను అనుభవించే అవకాశాన్ని ఇస్తుంది. ఈ వేరియంట్కు కూడా వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నాం.” అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఆల్ట్రోజ్‌ వేరియంట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ప్రసిద్ధ ఎంపికగా నిలిచింది. టాటా ఆల్ట్రోజ్ 9 నెలల్లోనే 25 వేల ఉత్పత్తి మార్కును దాటి, ఈ విభాగం నుంచి వచ్చిన సురక్షిత మోడల్గా ప్రసిద్ది చెందింది. దీనికి గాను గ్లోబల్ ఎన్సీఏపీ నుంచి ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ను కూడా అందుకుంది. కాగా, ఆల్ట్రోస్ అమ్మకాలు ఈ నెలలో మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉందని టాటా మోటార్స్ పేర్కొంది.



 

For All Tech Queries Please Click Here..!