Nissan Magnite: భారత మార్కెట్లోకి నిస్సాన్ మాగ్నైట్...ధరలు లీక్
ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ నుంచి భారత మార్కెట్లోకి మరో కారు అడుగుపెట్టనుంది. రానున్న సరికొత్త మాగ్నైట్ కారును ఈ నెలలోనే లాంచ్ చేస్తామని నిస్సాన్ సంస్థ ప్రకటించింది. లాంచ్ కి ముందే ఎస్‌యూవీకి సంబంధించిన ధరలు ఇంటర్‌నెట్‌లో లీక్ అయ్యాయి. లీకయిన ధరల ప్రకారం భారతదేశంలో నిస్సాన్ మాగ్నైట్ 1.0 లీటర్ XE పెట్రోల్ వేరియంట్ ధర రూ.5.5 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 1.0-లీటర్ టర్బో పెట్రోల్ XV ప్రీమియం CVT వేరియంట్ ధర రూ.9.55 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ధరలు) ఉంది. లీకైన ధరల ప్రకారం చూస్తే, నిస్సాన్ మాగ్నైట్ కారు హ్యుందాయ్ వెన్యూ, మారుతి విటారా బ్రెజ్జా వంటి వాహనాలతో పోటీ పడనుంది.
త్వరలో భారత్‌కు రానున్న ఈ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలను నిస్సాన్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ దాని ఇంజిన్ లైనప్ గురించి మార్కెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిస్సాన్ రెండు ఇంజిన్ ఆప్షన్‌లతో మాగ్నైట్ 2020ను అభివృద్ధి చేసింది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో ఈ ఎస్‌యూవీని రూపొందించారు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ యూనిట్ 6,250 rpm వద్ద అత్యధికంగా 71 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 3,500 rpm వద్ద 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 5,000 rpm వద్ద 99 bhp శక్తిని, 2,800- 3,600 rpm వద్ద 160 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టర్బో ఇంజిన్ CVT మోడల్ 2,200 నుంచి 4,400 rpm వద్ద 152 Nm టార్క్‌ను అందిస్తుంది.
ఇంధన సామర్థ్యం
నిస్సాన్ మ్యాగ్నైట్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ లీటరుకు 18.75 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. 1.0లీటర్ టర్బో పెట్రోల్- మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మోడల్ లీటరుకు 20 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. వీటితో పాటు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ CVT మోడల్ లీటరుకు 17.7 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని నిస్సాన్ ప్రకటించింది.
లీకైన నిస్సాన్ మ్యాగ్నైట్ ధరల వివరాలు
మోడల్ పేరు ధరలు (ఎక్స్ షోరూం)
నిస్సాన్ మ్యాగ్నైట్ XE రూ.5.5 లక్షలు
XL రూ.6.25 లక్షలు
XV రూ.6.75 లక్షలు
XV Premium రూ.7.65 లక్షలు
Turbo XL రూ.7.25 లక్షలు
Turbo XV రూ.7.75 లక్షలు
Turbo XVPremium రూ.8.65 లక్షలు
Turbo XL CVT రూ.8.15 లక్షలు
Turbo XV CVT రూ.8.65 లక్షలు
Turbo XV PremiumCVT రూ.9.55 లక్షలు